You are here
Home > Latest News > మొసలి కన్నీరు అంటే.. బాబు కంట కారాల్సిందే!

మొసలి కన్నీరు అంటే.. బాబు కంట కారాల్సిందే!

Spread the love

ఏపీతో తెలంగాణకు ఏ మాత్రం పోలిక లేదన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి పాలకులు హైదరాబాద్ ను అభివృద్ధి పేరుతో విధ్వంసం చేశారు అన్న మాటను.. పట్టుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది సందర్భమో అసందర్భమో కానీ.. ఓటుకు నోటు కేసులో రాజకీయ వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. నాడు ఎలాంటి హావభావాలు ప్రదర్శించాడో.. ఇప్పుడు చంద్రబాబు కూడా.. అలాంటి హావభావాలే ప్రదర్శిస్తూ నాటకాన్ని రక్తి కట్టించేశాడు.

హైదరాబాద్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ ఇండియా కాన్ క్లేవ్ లో.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సమాధానాలకు షేక్ అయి బ్రేక్ అయిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ.. తానేదో మంచి చేసినట్టు.. ఇప్పుడు కేసీఆర్ ఏదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. పనిలో పనిగా.. నవ్యాంధ్రులకు సమర్థత లేక కాదు.. అశాస్త్రీయ విభజన కారణంగానే సమస్యలు అని మరో చర్చకు దారి తీశాడు చంద్రబాబు.

నవ్యాంధ్రుల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒకప్పడు ఆంధ్రులు తమిళులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే.. ఛీ కొట్టి మద్రాసు నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారు. చివరికి తమ కుట్రలను నాటి నైజాం రాష్ట్రంపై చూపించి.. అమాయకులైన తెలంగాణ ప్రజలను మోసగించి.. పూర్తిగా స్వాధీనం చేసుకుని.. ఇక్కడి సంపదను.. తమ రాష్ట్రానికి దోచి పెట్టారు. నాటి నుంచి నేటి వరకూ అదే దోపిడీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. 1995 కు ముందు ఆ తర్వాత పోల్చి చూసుకుంటే.. హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుందన్న చంద్రబాబు.. మరి మిగతా జిల్లాలను ఏం చేసినట్టు? తనంతట తానే హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణను నిర్లక్ష్యం చేశాను అని ఒప్పుకున్నట్టే కదా?

హైదరాబాద్ ను కూడా.. సైబరాబాద్ అంటూ ఏదో నగరాన్ని ఆదరాబాదరగా సృష్టించేసి ప్రకృతి విధ్వంసానికి మూల కారకుడిగా చంద్రబాబు అపఖ్యాతి మూటగట్టుకున్న వాస్తవాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. మళ్లీ కుట్రలు చేస్తూ.. ఇక్కడి ప్రాంతంపై తనకున్న అనాసక్తతను ప్రదర్శించుకుంటున్నాడు. నవ్యాంధ్రులు సమర్థత లేనివారు కాదంటూనే.. కష్టాలు తీరకుంటే.. కోర్టుకైనా వెళ్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇలా మాట్లాడి చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను చేతగాని వాళ్లను చేస్తున్నాడు.

రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాకనే.. ఇలా తెలంగాణపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై.. చంద్రబాబు ఏడ్చి ఏడ్చి.. మరింతగా తన మనోభావాలను బయటపెట్టుకుంటున్నాడు.

Top