
అతి తెలివి చూపకు సంజయ్…
మీరు తిట్టింది కాంగ్రెస్‌ను కాదు…
మొత్తం తెలంగాణనే అవమానించారు
సమస్యను పక్కదారి పట్టించడం, ఎదుటివారిపై బురద జల్లడంలో బండి సంజయ్‌ను మించిన లత్కోర్గాడు లేనేలేడు. తెలంగాణ బిల్లు అశాస్త్రీయం అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను ఖండించాల్సిందిపోయి.. కాంగ్రెస్‌ను తిడితే తెరాసకు కోపం ఎందుకు వస్తున్నదంటూ దేడ్ దిమాగ్ మాటలు మాట్లాడుతుండు.
ఒరే నాయనా… మీ మోడీ కేవలం కాంగ్రెస్‌నే అవమానించలేదు. పార్లమెంటును అవమానించాడు. అప్పటి విపక్ష నాయకురాలు దివంగత సుష్మా స్వరాజ్‌ను ఆక్షేపించాడు.
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అఫ్ కోర్స్ కాంగ్రెస్‌ను విమర్శించడం వేరే విషయం. తెలంగాణ బిల్లుకు దేశంలోని దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. బీజేపీ బేషరతుగా మద్దతు తెలిపింది. బిల్లు బ్రహ్మాండగా నెగ్గింది. ఇక అది అశాస్త్రీయం ఎలా అవుతుంది ? విభజన తప్పు ఎలా అవుతుంది ? మానిన గాయాన్ని రేపితే ఎవరికైనా కోపం వస్తుంది.
తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. అయితే తెలంగాణ బిల్లుకు సపోర్ట్ ఇచ్చినా ఇక్కడి జనం తమను పట్టించుకోవడం లేదు అనేది మోడీ బాధ. అందుకే నాలుగు కోట్ల మంది మనసులను గాయపరిచాడు. విభజన తప్పన్నాడు. తలుపులు మూసేసి బిల్ పాస్ చేశారంటూ నోరుజారాడు.
ఇది కచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రధానిని కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే అహంకార పూరిత ధోరణి మన మోడీ సాబ్ గారిది. బండి సంజయ్ ఇవన్నీ దాటి పెట్టి కాంగ్రెస్ తిడితే బాధేంటి అని అడిగితే జాలి పడటం తప్ప ఏమీ చేయలేం. ఈయన తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.
రాష్ట్రం ఏర్పాటైన తరువాత విభజనే తప్పు అనడం ఎంతటి దుర్మార్గం! రెండు రాష్ట్రాల పంచాయితీలను పరిష్కరించాల్సిన నాయకుడే రెండింటి మధ్య విద్వేషాలు రెచ్చగొడితే కోపం రాకుండా ఉంటుందా! బీజేపీ చేసే చెత్త పనుల వల్లే తెలంగాణలో పిచ్చిపువ్వు పార్టీని కుక్కలు కూడా కేర్ చేయడం లేదు. సంజయ్ ఎక్కడికి వెళ్లినా ముఖం మీద ఉమ్ముతున్నారు. వీళ్లు జన్మలో మారరు.