
నమ్మండి నిజం..బీజేపీ 90 సీట్లు గెలుస్తదట
తెరాసను ఈజీగా ఓడిస్తదట
తెలంగాణ మీద అమిత్ షా దింపుడుగళ్లెం ఆశలను వదులుకోలేదు. భ్రమలను వీడటం లేదు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సెగ్మెంట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలకు షా చెప్పాడట. ‘90 ఫార్ములా’ ఫాలో అయితేటీఆర్ఎస్ను దెబ్బకొట్టవచ్చునట. అధికారంలోకి రావచ్చునట. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోంది. ఒక్క హుజురాబాద్‌లో గెలవంగానే ఏదో అయిపోయినట్టు హల్చల్ చేస్తోంది. వీళ్లకు గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు.
మోడీ పాలన చూశాక జనానికి బీజేపీపై విరక్తి పుట్టింది. దేశమంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో భారతీయ ఝూటా పార్టీని జనం పట్టించుకోవడం లేదు. వడ్లు కొనుగోలు చేయకుండా రైతన్నను నిండా ముంచింది. అన్నదాతలకు తీరని అన్యాయం చేసింది. రైతుల సంగతి వదిలేయండి.
మోడీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా ? ఏ ఒక్క వర్గానికి అయినా మేలు జరిగిందా ? జీఎస్టీ, నోట్లరద్దు, పెట్రోల్ ధరల పెరుగుదల, ఇష్టమొచ్చినట్టు లాక్డౌన్లు అమలు చేయడం వల్ల దేశం పదేళ్లు వెనక్కి వెళ్లింది. రాజకీయ ప్రత్యర్థులను వేటకుక్కల్లా వేటాడుతున్నారు. గ్యాస్ రేటు రూ.వెయ్యి అయింది. పెట్రోల్ రేటు రూ.100 దాటింది. వంటనూనె రేటిప్పుడు రూ.200. ఇక జనం బతకాలా చావాలా ?
దీనికితోడు మరోసారి కరోనా! బీజేపీ పాలిత రాష్ట్రాలకు తప్ప మిగతా వారికి నయాపైసా సాయం చేయడం లేదు. ఎకానమీ దారుణంగా పడిపోయింది. తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ప్రాజెక్టులకు రావాల్సిన నిధులను ఎగ్గొట్టారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసే లేదు. వడ్ల కొనుగోలుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. వడ్లు కొంటమంటరు.. అదే విషయాన్ని కాగితంపై రాసియ్యండిరా అంటే చప్పుడు చేయరు. తెలంగాణకు మేలు చేయడం అంటేనే మోడీజీకి నచ్చదు. ఇక్కడ 90 సీట్లు కాదు కదా తొమ్మిది సీట్లు కూడా గెలవరు.
జనంలో ఆదరణ లేదు. కార్యకర్తల బలం లేదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వల్ల దేశానికి హాని జరుగుతోందని ప్రతిఒక్కరికీ అర్థమవుతోంది. కిషన్ రెడ్డి, వివేక్, బండి సంజయ్, లక్ష్మణ్‌కు ఒక్క క్షణం కూడా పడదు. నిత్యం లడాయిలే! ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం కలలోనూ సాధ్యం కాదు. అమిత్ షా భ్రమల్లో బతుకుతున్నాడని చెప్పకతప్పదు.