You are here
Home > Uncategorized > రాజ్యాంగాన్నీ మార్చాలి… మోడీ సర్కారునూ మార్చాలి సంజయ్​

రాజ్యాంగాన్నీ మార్చాలి… మోడీ సర్కారునూ మార్చాలి సంజయ్​

Spread the love

 

 

రాజ్యాంగాన్నీ మార్చాలి…

మోడీ సర్కారునూ మార్చాలి సంజయ్​

లేకపోతే దేశం బూడిద కావడం గ్యారంటీ

బండి సంజయ్​ అనే ఒక థర్డ్​ గ్రేడ్​ లీడర్​ ఏనాడూ రాజకీయ పరిణతితో మాట్లాడడు. కనీస సర్పంచ్​స్థాయి నాయకుడికి ఉండే తెలివిలేదు. ఇట్లాంటి అపరమేధావి ఏమంటాడంటే.. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదట. కేసీఆర్​ సర్కారును మార్చాలట! అసలు కేసీఆర్​ రాజ్యాంగం గురించి ఏమన్నాడో బీజేపీ సన్నాసులకు అర్థం కాకే ఈ పిచ్చివాడుగు వాగుతున్నారు. మన రాజ్యాంగాన్ని సవరించి ఎన్నికల విధానాన్ని, పన్నుల విధానాన్ని, వ్యవసాయ విధానాన్ని మార్చుకున్నారు.

కొంతమందేమో విద్యుత్​ విధానం మారాలి. వైద్య విధానం మారాలి. విదేశీ విధానం మారాలి అంటారు. చాలా విధానాలపైన అసంతృప్తి ఉంది కాబట్టే మనదేశంలో ఉద్యమాలు, విప్లవాలు నడుస్తున్నాయి. ఈ రాజ్యాంగాన్ని మర్చాలన్న డిమాండ్​ ఇప్పటిది కాదు. కేసీఆర్​ కొత్తగా చేసిన డిమాండూ కాదు. ఎప్పటి నుంచో ఉన్నది. ఎంత పెద్ద మంచి సిద్ధాంతమైన కాలదోషం పడుతుంది. రాజ్యాంగం గొప్పదే అయినా కాలానికి అనుగుణంగా దానిని మార్చాలనడం తప్పెలా అవుతుంది?

కేసీఆర్​ చెప్పినట్టు రాజ్యాంగాన్ని మారిస్తే రాష్ట్రాలకు మరిన్ని హక్కులు వస్తాయి. దేశసంపదను సమానంగా పంపిణీ అవుతుంది. అవినీతి మరింత తగ్గుతుంది. కేంద్రం అధికారాలకు కత్తెరపడుతుంది. అందుకే సంజయ్​ వంటి బీజేపీ నాయకులు రాజ్యాంగానికి సవరణ అనగానే ఉలిక్కిపడుతున్నారు. మార్పునకు ఏదీ అతీతం కాదు. రాజ్యాంగం శిలాశాసనం కాదని, దీనిని మార్చొద్దని అంబేద్కర్​ ఏనాడూ అనలేదు. మన అధికారాలకు కత్తెర పడుతుందన్నదే బీజేపీ దొంగల భయం.

అన్నింటికంటే విచిత్ర ఏమిటంటే బీజేపీ సహా ఆర్​ఎస్​ఎస్​, భజ్​రంగ్​దళ్​ వంటివన్నీ రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తూనే ఉంటాయి. కేసీఆర్​ ఈ సమస్యను లేవనెత్తగానే ఆయన దేశద్రోహి అయిపోయారు. ఇండియా అంటే యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం మొద‌టి ఆర్టిక‌ల్‌లోనే ఉంది.  కేంద్ర ప్రభుత్వం ఏ విష‌యంలోనూ రాష్ట్రాల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. తెలంగాణ‌కు నీళ్లు ఇవ్వకుండా నదుల అనుసంధానం అంటూ డ్రామాలు చేస్తున్నారు.

త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల‌కే కేంద్ర బ‌డ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించారు. అంబేడ్కర్ క‌ల్పించిన హ‌క్కుల‌కు అన్యాయం జ‌రుగుతోంది. వాజ్‌పేయి ప్రభుత్వం గ‌తంలోనే రాజ్యాంగ పునఃస‌మీక్ష క‌మిటీని వేశారు. దానికి జ‌స్టిస్ వెంక‌టాచ‌ల‌య్య అధ్యక్షత వ‌హించారు. అంత‌కు ముందు కూడా ఇదే విష‌యంపై ప్రభుత్వాలు క‌మిటీలు వేశాయి. ఇప్పుడు కేసీఆర్​ కూడా ఇట్లాంటి కమిటీ గురించే మాట్లాడుతున్నారు. వీళ్లు చేస్తే సంసారం..కేసీఆర్​ చేస్తే వ్యభిచారమా ? ఈ విషయాలన్నీ తెలియక సంజయ్​ దేడ్​దిమాగ్ మాటలు మాట్లాడుతున్నాడు.

 

Top