You are here
Home > Uncategorized > బండి సంజయ్​.. నీకు కొంచెమైనా బుద్ధుందా ? మోడీ చెప్పిన ఉద్యోగాలు ఏమయ్యాయ్​..

బండి సంజయ్​.. నీకు కొంచెమైనా బుద్ధుందా ? మోడీ చెప్పిన ఉద్యోగాలు ఏమయ్యాయ్​..

Spread the love

 

బండి సంజయ్​.. నీకు కొంచెమైనా బుద్ధుందా ?

మోడీ చెప్పిన ఉద్యోగాలు ఏమయ్యాయ్​..

ముందు వాటి గురించి మాట్లాడు

 

కేసీఆర్​ సర్కారు ఉద్యోగాలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిలియన్​ మార్చ్​ చేస్తాడట! ఉద్యమాలు అంటే ఈయనకు జోక్​ అయిపోయాయి. నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం ఫ్యాషన్​ అయిపోయింది. ఈయన పిచ్చిమాటలను నమ్మి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బండన్న శవరాజకీయాలను ప్రభుత్వం అడ్డుకోకుంటే మరింత నష్టం తప్పదు.

 

కేసీఆర్​ ప్రభుత్వం ఇప్పటికే లక్ష 32వేల ఉద్యోగాలు ఇచ్చింది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటిలో సగమైనా ఇచ్చినట్లు నిరూపిస్తావా సంజయ్​ ? ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తానన్న బండి సంజయ్ ఆ మార్చ్​ ముందు మోడీ దగ్గర చేయాలి.  ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయమని మోడీని నిలదీయాలి.  మంత్రి కేటీఆర్ చొరవతో ప్రైవేట్ ​రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించారు. రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తెచ్చారు.

 

మన రాష్ట్రం ఐటీ, ఫార్మా, ఏవియేషన్​ హబ్​గా మారింది. ఉపాధి విపరీతంగా పెరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రైవేటు రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చూస్తే పరేషాన్ కాకతప్పదు. అక్కడ గవర్నమెంటు ఉద్యోగాలు లేవు. ప్రైవేట్​ ఉద్యోగాలు అసలే లేవు. పెట్టుబడులు పెట్టే మానవుడే లేడు. ఈ విషయాలను దృష్టి మరల్చడానికే సంజయ్​ ఈ డ్రామాలు ఆడుతున్నాడు. ఇక మోడీ సాబ్​ జాబ్స్ ఇవ్వడానికి బదులు ఉన్నవి పీకేశాడు. దిక్కున్నకాడ చెప్పుకోండి అని అంటున్నాడు. బీజేపీ వాళ్లు మాత్రం తెలంగాణలో జాబ్స్​ కోసం పోరాడుతున్నారు. ఎంత పెద్ద జోక్​ ఇది!!

Top