You are here
Home > National News > ఎవర్రా ఉద్యమ ద్రోహులు.. నువ్వు.. నీ పార్టీ నేతలు కాదా?

ఎవర్రా ఉద్యమ ద్రోహులు.. నువ్వు.. నీ పార్టీ నేతలు కాదా?

Spread the love

ఎవర్రా ఉద్యమ ద్రోహులు.. నువ్వు.. నీ పార్టీ నేతలు కాదా?

  •  ఉద్యమ ద్రోహలని ఎవర్ని అంటున్నావ్ సంజయ్?
  •  నీ పార్టీ నేతలు, ఆఖరికి నువ్వు కూడా కాదా?
  •  తెలంగాణను సాధించి.. అభివృద్ధి చేయడమే ద్రోహమా?

ప్రత్యేక రాష్ట్రం కోసం మూడున్నర కోట్ల మంది ఒక్కటై పోరాటం చేస్తుంటే.. చూస్తూ కాలయాపన చేసింది బీజేపీ నేతలు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని హామీ ఇచ్చి.. అధికారం కోసం అలవికాని మాటలు చెప్పి.. చివరికి తెలంగాణ ప్రజలను నట్టేన ముంచింది బీజేపీ నేతలు. తెలంగాణ ప్రజలు మోసపోతున్న తీరును కూడా రాజకీయాలకు వాడుకుని.. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు అడ్డగోలు పనులు చేసింది బీజేపీ నేతలు. అలాంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నువ్వు కూడా తెలంగాణ ద్రోహివే బండి సంజయ్.

మాట్లాడేముందు చరిత్ర తెలుసుకో. వందల మంది అమరులై తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు.. ఒక్క సుష్మా స్వరాజ్ తప్ప స్పందించింది ఎవరు? అలాంటి పార్టీ నుంచి వచ్చిన నువ్వా.. ఇప్పుడు నీతులు చెప్పేది? పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణను ఏర్పాటు చేస్తారా… అని ఇక్కడి ప్రజలను అవమానించిన మోదీ ఉన్న పార్టీలోనే నువ్వూ ఉన్నావ్ కదా.  అలాంటి నీకు ఇలాంటి మాటలు తప్ప ఇంకెలాంటి మాటలు వస్తాయ్ లే.

చావు నోట్లో తల పెట్టి.. కేంద్రాన్ని, అప్పటి జాతీయ ప్రతిపక్షాన్ని నేలకు దించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ ఎన్నో మైలు రాళ్లు అందుకుంది. తక్కువ సమయంలోనే.. కేంద్రం అండ లేకున్నా అనూహ్య పురోభివృద్ధిని సాధించింది. అలాంటి కేసీఆర్ మాత్రమే ఎప్పటికీ తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పేజీ కలిగి ఉంటారు. ఆయనతోనే.. ప్రజలు బంగారు తెలంగాణను సాధించుకుంటారు.

కేసీఆర్ కు కాదు సంజయ్… ముందు నీకు మెడ మీద తలకాయ ఉందా లేదా చూసుకో. పసుపు బోర్డు అని ప్రాంతీయ కేంద్రం తెచ్చారు. నిధులు సాధించకుండా నట్టేట ముంచారు. యూరియా అందించకుండా రైతులను మోసం చేశారు. నీకు తలకాయ ఉందో లేదో ఆలోచించి మాట్లాడు. నీ స్థాయి, అర్హత తెలుసుకున్నాక.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. లేదంటే.. నీకు తెలంగాణ ప్రజల చేతిలో దేక్ తడి.. పోచమ్మ గుడే. కావాలంటే.. చరిత్ర చదువుకో. నీ పార్టీతో ప్రజలు ఆడుకున్న ఆటలు చదువుకో.

Top