You are here
Home > Uncategorized > తప్పుడు ప్రచారం ఆపండి సంజయ్.

తప్పుడు ప్రచారం ఆపండి సంజయ్.

Spread the love

 

  1. తప్పుడు ప్రచారం ఆపండి సంజయ్.
  2. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందంటున్నవ్.
  3. కానీ వైరస్ నియంత్రణకు చిత్తశుద్ధితో సర్కార్ పనిచేస్తోంది.
  4. కేసులు పెరుగుతున్న గుండె నిబ్బరంతో పనిచేస్తోంది.
  5. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ను ఫాలో అవుతోంది ప్రభుత్వం.

కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతులెత్తేశారంటున్న బండి సంజయ్. కరోనా విజృంభణకు అమెరికా ప్రెసిడెంటే ఏమీ చేయలేకపోయాడు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం అన్నది ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే.. అది ప్రజల్లోకి వెళ్లిపోయింది. కంటికి కనిపించేదైతే.. ఏదో ఒకటి చేయొచ్చు. కానీ కరోనా మహమ్మారి.. సూక్ష్మ జీవి కావడంతో.. ఎక్కడ, ఎవరికి ఎలా వ్యాపిస్తుందో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే దారుణంగా ఉంది. హాస్పిటల్స్ బెడ్స్ కూడా దొరకడం లేదు. కరోనా పేషెంట్లు.. హాస్పిటల్స్ ఆవరణల్లో కుప్పలుగా పడి ఉంటున్నారు. ఇవేం నీకు కనిపించవా సంజయ్.

కరోనా కట్టడిలో ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది?. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో తెలంగాణ.. పెద్ద రాష్ట్రాలకంటే ముందుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా… ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకుంది.. కాపాడుకుంటోంది. కరోనా టెస్టుల కోసం అడ్వాన్స్ మిషన్లు ఆర్డర్ చేసుకుంటే.. వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిన దిక్కుమాలిన రాజకీయ నాయకులు మీ బీజేపీ నేతలు. తెలంగాణకు ఆర్థికంగా, వైద్య పరంగా ఎటువంటి సాయం చేయని మీరు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా?. కరోనా విషయంలో అసలైన ఫెయిల్యూర్ మీ కేంద్రానిదే బండి సంజయ్. కేంద్ర సడలింపుల తర్వాతే దేశంలో లక్షలాదిగా కేసులు పెరిగాయి. లాక్ డౌన్ ఎత్తేయాలని ఎవ్వరూ కోరకున్నా.. కేవలం మీకు ఫండింగ్ ఇచ్చే వ్యాపారుల ఒత్తిడితో సడలింపులు ఇచ్చారు.

కరోనా కేసులు పెరుగుతుంటే.. కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేకుండా.. బెల్లం కొట్టిన రాయిలా పడి ఉన్నారు. ఇక్కడ మాత్రం సీఎం చేతులెత్తేశారని విమర్శిస్తున్నారు. సీఎం సరే.. ప్రధాని ఏం చేస్తున్నారు. తెలంగాణ గానీ.. కేసులు ఎక్కువగా ఉన్న మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటివి భారత్ లోనే ఉన్నాయి కదా?. దేశానికి ప్రధాని అయినప్పుడు.. రాష్ట్రాలను కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత ఎవరిది?. దీనిపై మాత్రం మీకు మాటలు రావు కదా బండి సంజయ్?.  తప్పు మీ దగ్గర పెట్టుకుని..

Top