You are here
Home > Latest News > బండి సంజయ్ ను చూసి దేనితో నవ్వాలో అర్థంకాట్లే.

బండి సంజయ్ ను చూసి దేనితో నవ్వాలో అర్థంకాట్లే.

Spread the love

బండి సంజయ్ ను చూసి దేనితో నవ్వాలో అర్థంకాట్లే.

  • బీజేపీ ఒత్తిడితో ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చిందట.
  • లేకపోతే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేకపోయేవారట.
  • అయ్యా బండి సంజయ్.. తమరు రాష్ట్ర అధ్యక్షుడు కూడా..
  • కాకముందే.. పీఆర్సీ కమిటీని సర్కార్ వేసింది.

ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు ఎప్పుడో వేసింది.
బీజేపీ పోరాటాలు, ఉద్యమాల వల్లే పీఆర్సీ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న బండి సంజయ్.. మీకంత సీన్ లేదన్న విషయం తెలుసుకో. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతోనే ఉద్యోగులకు ఊహించనంత పీఆర్సీ వచ్చింది. ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీ ఏడు శాతం మాత్రమే ఇవ్వాలని చెప్తే.. సీఎం కేసీఆర్ దాన్ని మూడింతలు పెంచి 30శాతం ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు క్రెడిట్ ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు, బండి సంజయ్ దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తమ పోరాటాలు, బీజేపీ ఒత్తిడితోనే పీఆర్సీ వచ్చిందని లొట్టపీసు మాటలు మాట్లాడుతుండు.

బీజేపీ వల్ల ఊది కాలదు.. పీరి లేవదు బండి సంజయ్. మీ వల్లే పీఆర్సీ వచ్చిందంటే.. దేనితో నవ్వాల్నో అర్థం కావడం లేదు. ప్రతీది మీ వల్లే అవుతోందనుకుంటే పొరపాటే. ప్రతీదాంట్లో మీ క్రెడిట్ వెతుక్కోవడం సిగ్గు చేటు. ప్రభుత్వం చేసేది కూడా మీతోనే అయిందంటే ఎలా?. మీకు చేతనైంది మాత్రం చెయ్యరు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా?. ఆరేళ్లలో ఎన్ని నిధులు తెచ్చారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సినవి కాకుండా.. మీరు సొంతంగా తీసుకొచ్చినవి??. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా?. కేంద్రం నుంచి పైసా నిధులు తెచ్చిన మొహాలేనా మీవి?. ఇప్పుడు రాష్ట్రం ఇచ్చే పీఆర్సీలో క్రెడిట్ కోసం మాట్లాడటానికి నోరెలా వస్తుంది.

బీజేపీ నాయకులెవ్వరికీ సిగ్గులేదని నీ మాటల వల్ల తెలుస్తోంది గుండు సంజయ్. ప్రభుత్వం చేసే పనులను తమ వల్లే సాధ్యమైందని జబ్బలు చరుచుకోవడం కాదు.. ముందు మీరు చేయాల్సినవి చేయండి. మీ పార్టీయే దేశాన్ని ఏలుతోంది. రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నవి ఇవ్వమని చెప్తోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఐటీఐఆర్ వాటిపై కేంద్రంతో కొట్లాడి తీసుకురాండి. మీకు తోడుగా టీఆర్ఎస్ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సినవి చేయకుండా.. ఇక్కడెన్ని గొప్పలు చెప్పినా వేస్టే సంజయ్.

Top