You are here
Home > Latest News > తియ్యటి మాటలతో కడుపు నిండదని.. మోడీకి కూడా చెప్పు సంజయ్!

తియ్యటి మాటలతో కడుపు నిండదని.. మోడీకి కూడా చెప్పు సంజయ్!

Spread the love

తియ్యటి మాటలతో కడుపు నిండదని.. మోడీకి కూడా చెప్పు సంజయ్!

– కేసీఆర్ పై ఏడుపులు కాదు.. ముందు మోడీని మారాలని చెప్పండి

– జిల్లాల పర్యటనలకు ముందు.. కేంద్రం చేసిన సాయం గురించి చెప్పండి

– జనాలు మంచీ చెడూ మాట్లాడితే మీరు ఏ ఊరూ తిరగలేరని గ్రహించండి

సంజయ్ బాబూ.. నువ్వు బీజేపీ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడువే కావచ్చు. నీ నోటికి అడ్డూ అదుపూ లేకుండా ఉండవచ్చు. కానీ.. జనానికి అలాంటివి ఏం ఉండవ్. వాళ్లకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటరు. నచ్చకపోతే.. కాంగ్రెస్, టీడీపీ మాదిరిగా తీసి మురికి కాలువల్లో పడేస్తరు. నీ తీరు చూస్తుంటే.. నీ మాట తీరు గమనిస్తుంటే.. ఆ రెండు పార్టీల తర్వాత నీకు, నీ పార్టీకే జనం మురికి కాలువల్లో చోటు ఇచ్చేలా కనిపిస్తున్నరు. అందుకు చాలానే కారణాలు కూడా ఉన్నాయి.

ప్రజలకు తియ్యటి మాటలు చెబితే కడుపులు నిండవని అంటున్నవ్ కదా. మరి 8 ఏళ్లుగా మోడీ చేస్తున్నది ఏంటి? తియ్యటి మాటలు చెప్పడం కాదా? ఆఖరికి కరోనా కాలంలో కూడా పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజల కడుపు మీద కొడుతూ.. వారి జేబులకు చిల్లులు పెడుతూ.. ఆత్మ నిర్భర్ అనీ.. అన్న యోజన అనీ తియ్యటి మాటలు చెప్పడం లేదా? ఇదే సమయంలో.. కేసీఆర్ నేరుగా పేదల ఖాతాల్లోకి డబ్బులు వేసి, బియ్యం కూడా ఇస్తున్నారు.

జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.2 వేలు, బియ్యం ఇస్తున్నారు. ఇంతగా చేస్తున్న కేసీఆర్ ను పట్టుకుని తియ్యటి మాటలని అంటావా? ముందు నీ మోడీని అలాంటి తియ్యటి మాటలు ఆపాలని చెప్పు సంజయ్. ఆ తర్వాత.. రాష్ట్రం గురించి ఆలోచించు. ఎందుకంటే.. ఇక్కడంతా బాగానే ఉంది. ప్రజలు హాయిగా 2 పూటలా తింటున్నారు. కేసీఆర్ పరిపాలనలో ఆరోగ్యంగా జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు.

ఇక… డీకే అరుణ. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని అంటున్నారు. ఇంత తెగించి మరీ కేసీఆర్ పోరాడుతుంటే.. ప్రజల కోసం కేంద్రానికి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖలు రాస్తుంటే నీ కంటికి ఎందుకు కనిపించడం లేదమ్మా అరుణమ్మా? కాస్త తెలివి పెంచుకో. బీజేపీలో చేరి.. ఉన్న నాలెడ్జ్ ను పాడు చేసుకున్నావన్న పేరు నీరు మర్యాద కాదు. జనం కోసం ఏపీ ప్రభుత్వంతో కలబడుతున్న కేసీఆర్ ను విమర్శిస్తూ జనం దృష్టిలో తప్పు చేయకు. తర్వాత.. నీ ఇష్టం.

అలాగే.. జిల్లాల పర్యటన చేస్తానని ఉత్సాహ పడుతున్న సంజయ్.. ఓ విషయం గుర్తుంచుకో. గతంలో నీలాగే లక్ష్మణ్ చేసిన పర్యటన ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో గుర్తు చేసుకో. జనాలు మంచీ చెడూ మాట్లాడితే ఏ ఊరూ తిరగలరేన్న వాస్తవాన్ని తెలుసుకో. ఆ తర్వాతే.. నీ పర్యటన, చిల్లర మాటల సంగతి ఆలోచించు.

Top