You are here
Home > News > ఊసరవెల్లే…. ఊసరవెల్లి గురించి మాట్లాడుతోంది.. ఇదెట్టా.. ఇదెట్టా!

ఊసరవెల్లే…. ఊసరవెల్లి గురించి మాట్లాడుతోంది.. ఇదెట్టా.. ఇదెట్టా!

Spread the love

ఊసరవెల్లే…. ఊసరవెల్లి గురించి మాట్లాడుతోంది.. ఇదెట్టా.. ఇదెట్టా!

  • రాజకీయ రంగులు మార్చడంలో ముదిరిపోయిన బండి సంజయ్
  • మాట తప్పి ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిన బీజేపీ నేతలు
  • పని చేతకాక.. కేసీఆర్ పై పడి ఏడుస్తున్న ఎర్రి పుష్పాలు

పని చేతగాని రాజకీయ నాయకుడు పక్కోడి మీద పడి ఏడ్చిండట. ఇది బండి సంజయ్ విషయంలో అచ్చంగ నిరూపితం అయితున్నది. కరీంనగర్ ఎంపీగా ఏమీ పని చేయలేక.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కూడా రాష్ట్రంలో ఉన్నగానొక్క ఎమ్మెల్యే రాజాసింగ్ తో సమన్వయం చేసుకోలేక.. సతమతం అయితున్న సంజయ్.. కేసీఆర్ పరిపాలన మీద పడి ఏడుస్తున్నడు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు.

కేంద్రం ఇటీవల చేసిన ఓ పనికిమాలిన ప్రయత్నం.. విద్యుత్ చట్ట సవరణ. కరోనా నియంత్రణలో విఫలమైన తీరు నుంచి బయటపడేందుకు.. జీడీపీ పతనం నుంచి జనం ఆలోచనను పక్కకు మరల్చేందుకు.. కేంద్రం వేసిన ఈ ఎత్తుగడ.. ఎప్పుడో విఫలమైంది. చాలా వరకు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి. అందులో.. తెలంగాణ కూడా ఒకటి. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రం యత్నాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

ప్రతిపాదిత చట్ట సవరణ ఆమోదం పొందితే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యం కాదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. అంతేకాదు. విద్యుత్ రంగంపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. విద్యుత్ చార్జీలకు అడ్డూఅదుపూ ఉండదు. విద్యుత్ సరఫరాకు జవాబుదారీ తనం అంటూ ఉండదు. ఇలాంటి సమస్యలు అన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్.. శాసనసభ వేదికగా ఎండగట్టారు.

జనానికి ఇవన్నీ అర్థమైతే.. కేంద్రంపై వ్యతిరేకత ఎక్కడ మరింత పెరుగుతుందో అన్న ఆందోళన బండి బ్యాచ్ లో మొదలైంది. అందుకే.. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ తనకే అలవాటైన తప్పుడు ప్రచారానికి దిగాడు బండి. ఇలా మాట్లాడ్డంలో ముందుంటాడు కానీ.. పసుపు బోర్డు, రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు, కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నుంచి ఏం సాధిస్తున్నాడని అడిగితే మాత్రం ఆయన తోక ముడుస్తాడు. ఎందుకురా మీకీ చాతకాని రాజకీయాలు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేంద్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. అది ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం. రాజధాని లేని రాష్ట్రం కాబట్టి.. కేంద్రం చెప్పినట్టు వినాల్సిన అవసరం వారికి ఉంది. కాబట్టి.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు ఏం సంబంధం? అందుకే.. సంజయ్.. కాస్త జాగ్రత్తగా మాట్లాడు. తప్పుడు కూతలను భరించేందుకు ఇక్కడి జనాలు ఎవరూ సిద్ధంగా లేరు. నోరు అదుపులో పెట్టుకో.

Top