You are here
Home > Telangana > ప్రాజెక్టుల యాత్ర కాదు.. మీరు చేస్తున్నది దగాయాత్ర

ప్రాజెక్టుల యాత్ర కాదు.. మీరు చేస్తున్నది దగాయాత్ర

Spread the love

ప్రాజెక్టుల యాత్ర కాదు.. మీరు చేస్తున్నది దగాయాత్ర

రీడిజైనింగ్ చేయకుంటే మరింత నష్టం జరిగేది…

ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్​

కాళేశ్వరంపై కాంగ్రెస్​ కడుపుమంట రోజురోజుకూ పెరుగుతోంది.  ఈ అద్భుత ప్రాజెక్టు వల్ల వేల మంది రైతులు జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. లక్షల ఎకరాలు సశ్యశ్యామలం అవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్టు మంచిది కాదని నిరూపించడానికి కాంగ్రెసోళ్లు తంటాలుపడుతున్నారు. అవినీతి కోసం ప్రాజెక్టుల‌ను రీడిజైన్ చేశార‌ని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం ఇందుకే. ప్రాజెక్టులను పరిశీలించడానికి ప్రాజెక్టుల యాత్ర పేరుతో కార్యక్రమం చేపడతామని తాజాగా సీఎల్పీ లీడర్​ మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.

విక్రమార్కా.. అస‌లు అవినీతి జ‌రిగింది కాంగ్రెస్ హ‌యాంలో. తెరాస మీద ఏడిస్తే ఏం లాభం ?  కాంగ్రెస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేయకుండానే అంచనాలు వంద శాతం పెంచారు. ప్రతి దాంట్లో అవినీతి చేయడం మీకు అలవాటు. మీరు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ది  తెరాస ప్ర‌భుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.  ప్రతిపక్షాలు  కోర్టులకు వెళ్లి ప్రాజెక్ట్ పనులు ఆపించేందుకు ప్రయత్నించాయి. మీ వాళ్లు కేసులతో అడ్డుకోకుంటే కాళేశ్వరం నుంచి ఎప్పుడో నీళ్లు అందేయి. ఇంజ‌నీర్లు, కేంద్ర జ‌ల‌సంఘం సిఫార్సుల మేర‌కే ప్రాజెక్టుల‌ను రీడిజైన్ చేశారు.

మీరు చెప్పినట్టు ప్రాజెక్టును నిర్మిస్తే వేల కోట్లను అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇవన్నీ నీకు తెలియవని కాదు. నీ ప్లాన్ వేరు. అవినీతి ఆరోపణల ముసుగుతో ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. అవినీతి అవినీతి అంటూ మొరుగుతున్న మీ నాయ‌కులు క‌నీసం ఒక్క ఆధార‌మూ చూప‌లేక‌పోతున్నారు. కేవలం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి యాత్రకు బయల్దేరుతున్నారు. మీకు దమ్ముంటే.. ఒక్క ఆధారంతో కోర్టులో కేసు వేయండి. సీబీఐకి ఫిర్యాదు చేయండి. ఇలాంటి యాత్రలతో ఫలితం శూన్యం

 

Top