You are here
Home > Uncategorized > అభివృద్ధి కోస‌మే అప్పులు

అభివృద్ధి కోస‌మే అప్పులు

Spread the love

అభివృద్ధి కోస‌మే అప్పులు

ఓర్వ‌లేకే విప‌క్షాల ఆరోప‌ణ‌లు

 

కాంగ్రెస్ రోజూ చేసే ఆరోప‌ణ‌నే టీపీసీసీ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి చేశాడు. తెలంగాణ ప్ర‌భుత్వం విప‌రీతంగా అప్పులు చేసింద‌ట‌. రుణాల ఊబిలో కూరుకుపోయింద‌ట‌. అభివృద్ధి జ‌ర‌గ‌డం లేదంటూ గాలి పోగేసి మాట్లాడాడు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాల హ‌యాంలో ఇంత‌కంటే అప్పులు చేశారు. అప్పుడు మాత్రం ఒక్క మాట మాట్లాడ‌లేదు. కేసీఆర్ త‌న సొంత అవ‌స‌రాల కోస‌మో, త‌న బ్యాంకు ఖాతాలో దాచుకోవ‌డానికో అప్పులు చేయ‌డం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే రుణాలు తీసుకుంటున్నాడు.

ఈమాత్రం అవగాహన లేకుండానే అప్పులను అస్త్రంగా మలుచుకోవచ్చనుకుంటే అది మీ అమాయకత్వం.తెలంగాణ రాష్ర్టానికి వారసత్వంగా వచ్చిన అప్పు 72 వేల కోట్లు. నాలుగేండ్లలో 70 వేల కోట్ల అప్పు కొత్తగా తెచ్చామని అసెంబ్లీలో ఈ మధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు 1.42 ల‌క్ష‌ల‌ కోట్లు ఉందని స్పష్టం చేశారు. నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్ర సంపద రూపంలో మన కళ్ల ముం దే కనిపిస్తున్నాయి. కేవలం మూడున్నరేండ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు సుమారు 48 వేల కోట్లు వెచ్చించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే సుమారు 30 వేల కోట్లకు పైగా వెచ్చించారు.

మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సుమారు 17 వేల చెరువుల మరమ్మతుల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశారు. మిషన్ భగీరథ పథకం అంచనా వ్యయం 43 వేల కోట్లు. ఇప్పటివరకు దానిపై సుమారు 25 వేల కోట్లకు పైగా వెచ్చించారు. నాలుగేండ్లలో తెచ్చిన అప్పుల కంటే మించి ఆస్తులు సృష్టించబడ్డాయని పై మూడు పథకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు పై మూడింటి సంపద విలువనే సుమారుగా 76 వేల కోట్లు అవుతున్నది. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులపై ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని కలిపితే అప్పులను మించి ఆస్తుల సృష్టి జరిగిందని ఎవరికైనా అర్థమవుతుంది. ఇక ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితిని గ‌మ‌నిద్దాం.

ఉత్త‌ర ప్ర‌దేశ్ అప్పు  అక్ష‌రాలా రూ. 4,61,913 కోట్లు.. అంటే తెలంగాణ కంటే మూడు రెట్లు ఎక్కువ‌. బెంగాల్ ఎంత అప్పు క‌ట్టాలో తెలుసా ? రూ. 3,94,832 కోట్లు , అభివృద్ధిలో అగ్ర‌భాగాన ఉంద‌నే భావించే కేర‌ళ అప్పుల విష‌యంలో ఐదోస్థానంలో ఉంది. పంజాబ్ ధ‌నిక రాష్ట్రం అంటారు క‌దా! అప్పులు చేయ‌డంలో దాని ర్యాంకు ఆరు. ఈ రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ అప్పు పెద్ద విష‌య‌మే కాదు.   అప్పుల నిర్వ‌హ‌ణ‌లో తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా రాష్ట్రాలు స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆర్‌బీఐ స్వ‌యంగా వెల్ల‌డించింది. గత నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించింది. కాగ్‌ రిపోర్టు ప్రకారం కేంద్ర ఆర్థికశాఖ ఈ గణాంకాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు మాసాల్లో రాష్ట్రం 21.96 శాతం ఆర్థిక వృద్ధి సాధించింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో దేశంలోని ఏ రాష్ట్రం మనకు దరిదాపుల్లో లేదు. 10 శాతానికిపైన కేవలం రెండో మూడో రాష్ట్రాలున్నయి. అంటే అప్పులకు ధీటుగా ఆదాయం పెరుగుతుంద‌న్న మాట‌. దీనిని బ‌ట్టి చూస్తే రూ.1.42 ల‌క్ష‌ల కోట్ల అప్పు తెలంగాణ‌కు స‌మ‌స్యే కాదు.

 

 

Top