You are here
Home > National News > భయం వద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలు..

భయం వద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలు..

Spread the love
  • భయం వద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలు..
  • పుకార్లు లేపొద్దు.. చిట్కా వైద్యానికి దూరముందాం

కరోనా భయంతో ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతుంటే కొందరు పుకార్లరాయుళ్లు ఇంకా భయపెడుతున్నారు. వ్యాధి లేనోళ్లకు కూడా వచ్చిందని చెబుతూ ఫేస్​బుక్​, వాట్సప్​లో పోస్టులు పెడుతున్నారు. వీళ్లు కరోనా కంటే ప్రమాదకర వ్యక్తులు. ఇలాంటి కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కొత్తగూడెం ఒక పోలీసు అధికారి కొడుకు ఫారిన్​ నుంచి వచ్చాడు. అతనికి కరోనా ఉంది. కొడుకుతోపాటు తల్లిదండ్రులూ ఫంక్షన్లకు వెళ్లడం ముగ్గురికీ ఇప్పుడు వ్యాధి వచ్చింది.

ఇలాంటి వాళ్లతోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రభుత్వం ఎంత చేస్తున్నా ప్రజలు సహకరించకుంటే ఆ ప్రయత్నం వృథా అని అందరం గుర్తుంచుకోవాలి. అదృష్టవశాత్తూ మన రాష్ట్రంలో కరోనా కేసులు అతి తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణం. కరోనా వైరస్ మీద తెలంగాణలో వస్తున్న వార్తల పై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త‌ తీసుకుంటున్నది. హైకోర్ట్ సైతం పలు జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ‌వుతున్న తరుణంలో అసెంబ్లీలో కూడా జాగ్రత్త‌లు తీసుకుంటున్నది.   కరోనాపై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. కరోనాకు మనిషిని చంపేంత శక్తి  లేదని వైద్యులు చెబుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులతో మనం నడుచుకునే విధానమే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌ ధరించాలి. ఇతరులను పలకరించేటప్పుడు కరచాలనం కాకుండా, నమస్కరిస్తే చాలు.ఇప్పటి నుంచి కేవలం గాంధీ ఆస్పత్రిలోనే కాకుండా ఐసోలేషన్‌ వార్డులు ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వ్యాధి లక్షణాలున్న వారు శాంపిల్స్‌ ఇవ్వొచ్చు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉండి, శాంపిల్స్‌ రిజల్ట్స్‌ వచ్చేంతవరకు వైద్య సేవలు పొందవచ్చు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. కరోనా ట్రీట్​మెంట్​కు కేవలం ఇంగ్లిష్​ వైద్యాన్ని నమ్ముకోవడం బెస్ట్​. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు కరోనాను తగ్గిస్తాయనడానికి సైంటిఫిక్​ ఎవిడెన్సులు లేవని గుర్తుంచుకోండి.

Top