You are here
Home > Latest News > యూరియా కొరత అంటూ లేనిపోనివి సృష్టించకు భట్టీ

యూరియా కొరత అంటూ లేనిపోనివి సృష్టించకు భట్టీ

Spread the love

 

  • రాష్ట్ర రైతులందరికీ సరిపోయే యూరియాను సరఫరా చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది
  • మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులు రైతులకు అందనున్నాయి
  • యూరియా కొరత ఉందంటూ కావాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి
  • నేరుగా యూరియాను గ్రామాలకు పంపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది
  • యూరియా కొరత అంటూ లేనిపోనివి సృష్టించకు భట్టీ

భట్టి విక్రమార్క… కావాలని మంటల మీద పెట్రోల్ జల్లుతున్నావా? రాష్ట్రంలో యూరియా కొరత లేదు. కానీ.. కావాలని మీరు యూరియా కొరత ఉన్నట్టుగా సృష్టించి అన్నదాతల్లో లేనిపోని భయాలను సృష్టించారు. కేంద్రం నుంచి నిజంగానే యూరియా వచ్చి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాదు కదా. తెలంగాణ రైతన్న కోసం ఎంతో చేసిన సీఎం కేసీఆర్.. యూరియా కొరత ఎందుకు రానిస్తారు. కావాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. అయినప్పటికీ మీకు వచ్చేదేమీ ఉండదు.

అందుకే సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని రైతులందరికీ సరిపోయేంత యూరియాను వెంటనే గ్రామాల్లోకి సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే మూడునాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువును రైతులకు అందించాలన్నారు. వెంటనే స్టాక్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి లారీలు, రైళ్ల ద్వారా తరలించి… డైరెక్ట్ గా రైతన్న దగ్గరికే చేరేలా చేయాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణకు రావాల్సిన యూరియా.. ప్రస్తుతం వైజాగ్, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం నౌకాశ్రయాలకు చేరింది. అయితే అక్కడి నుంచి రావడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల యూరియాకు కొంచెం కొరత ఏర్పడింది. సాధారణ పద్ధతుల్లో అవి తెలంగాణకు రావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే… రైళ్ల ద్వారా యూరియాను తెలంగాణకు చేరవేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ఇవన్నీ తెలియని ప్రతిపక్షాలు కావాలని సీఎం కేసీఆర్ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయి. ఇప్పటికే… ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో ఆరు లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. సాధారణంగా ప్రతి వానాకాలం సీజన్ లో తెలంగాణ రైతులకు ఆరు లక్షల టన్నుల వరకే యూరియా అవసరం అయ్యేది. కానీ.. ఈసారి రైతులు వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను ఒకేసారి వేయడంతో యూరియా అవసరం పెరిగింది. పంటల విస్తీర్ణం కూడా పెరగడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. అంతే తప్పితే తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో విఫలం అయిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ప్రచారాల్లో ఎటువంటి నిజం లేదు.

భట్టి విక్రమార్క.. నువ్వు కావాలని తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసి.. యూరియా కొరత అంటూ తప్పుడు ప్రచారం చేసినా నీకు ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికే తెలంగాణలోని గ్రామాల్లోకి యూరియా సరఫరా ప్రక్రియ ప్రారంభం అయింది. రెండు మూడు రోజుల్లో యూరియా నేరుగా గ్రామాలకే చేరుతుంది. ఒకరిపై వేలెత్తి చూపే నువ్వు.. ఒకసారి కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలి. యూరియా కోసం రైతన్నలు కాంగ్రెస్ హయాంలో పడిగాపులు కాశారు. నెలలకు నెలలు పడిగాపులు కాసినా యూరియా దొరకలేదు. 40 ఏళ్ల కాలంలో ఏనాడూ రైతన్నను పట్టించుకోని మీరు ఇప్పుడు శుద్ధపలుకులు పలుకుతున్నారా భట్టి. మీ గురించి ఎవరికి తెలియదు. దేశమంతా తెలుసు. పిచ్చి కూతలు కూయకుండా నోరు మూసుకొని కూర్చోండి. అంతే కానీ… కావాలని పుల్లలు పెడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమేస్తారు జాగ్రత్త.

 

 

 

 

 

 

 

Top