You are here
Home > Latest News > తల్లీ భూమికా.. ఈ దుర్మార్గపు రాజకీయాలను క్షమించు

తల్లీ భూమికా.. ఈ దుర్మార్గపు రాజకీయాలను క్షమించు

Spread the love

అభం శుభం ఎరుగని చిన్నారి భూమిక.. లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో చనిపోతే.. ఆ చిన్నారి మరణంపై కొన్ని పార్టీలు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు శవ రాజకీయం చేస్తున్నాయి. లారీ ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్వయనా.. భూమిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా.. కొందరు తప్పుడు ప్రచారాలతో.. ప్రభుత్వంపై మరణాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే.. ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్యకూ ప్రభుత్వమే కారణమని చెప్పే ప్రయత్నం చేసి.. కొందరు చేతుల కాల్చుకున్నారు.

ఇప్పుడు భూమిక అనే అమ్మాయి మరణాన్ని కూడా.. అలాగే వివాదాస్పదం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా.. భూమిక ఆత్మే గనక ఉంటే.. ఇలాంటి తప్పుడు రాజకీయాలను చూసి ఎంత క్షోభిస్తుందో. అందుకే.. ముందుగా.. ఆ చిట్టితల్లి ఆత్మను క్షమాపణ కోరుతున్నాం. ఆమె మరణాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి దుర్మార్గ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు తగిన బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం. గుంతలు లేని చోట గుంతలు ఉన్నాయంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. కానీ.. అక్కడ గుంతలే లేవని..  స్థానికులు కూడా చెబుతున్నారు. ఎందుకింత కుట్ర.. ఎందుకింత శవ రాజకీయం? చిన్నారి శవాన్ని కూడా వదిలపెట్టరా ఈ దుర్మార్గులు?

మీడియాలో తప్పుడు కథనాలు.. సోషల్ మీడియాలో వికృతమైన క్రియేటివిటీతో రాతలతో.. వారు రాస్తున్న కథనాలను చూసి కూడా.. భూమిక ఆత్మ బాధ పడవద్దని కోరుకుంటున్నాం. ఒక చిన్నారి మరణంపై.. ఇంతకంటే ఎక్కువగా చర్చించి.. వారి కుటుంబసభ్యులను బాధ పెట్టడం కంటే.. ముందుగా మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడమే మన ముందున్న కర్తవ్యమన్న వాస్తవాన్ని గుర్తిద్దాం. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కూడా.. ఇలాంటి శవరాజకీయాలను.. కనీసం చిన్నారుల విషయంలో అయినా.. ఆపుతాయేమో.. ఎదురుచూద్దాం.

 

 

Top