You are here
Home > Uncategorized > మరాఠా దెబ్బకు గుజరాత్​ మాఫియ విలవిల

మరాఠా దెబ్బకు గుజరాత్​ మాఫియ విలవిల

Spread the love
  • బీజేపీ చెంప పలగ్గొట్టిన ప్రాంతీయ పార్టీలు
  • మరాఠా దెబ్బకు గుజరాత్​ మాఫియ విలవిల
  • అస్థిత్వం, ఆత్మగౌరవం జోలికొస్తే ఎక్కడైనా ఇదే గతి తప్పదు

 

కేంద్రంలో అధికారంలో ఉన్నాంకదా.. గవర్నర్ల ద్వారా ఏదైనా చేసేయొచ్చని విర్రవీగుతున్న బీజేపీకి చెంప చెళ్లుమనేలా బుద్ధి చెప్పాయి ప్రాంతీయ పార్టీలు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల్ని బూచిగా చూపెట్టినంత మాత్రాన గుజరాత్​ మాఫియాకు భయపడే ప్రక్తేలేదని మరాఠా నేతలు తేల్చిచెప్పారు. ఒక ప్రాంతం యెక్క అస్థిత్వం, ఆత్మగౌరవాలతో ఆడుకుంటే మోదీనైనా, అమిత్​ షాలనైనా ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతామని ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​, శివసేన చీఫ్​ ఉద్దేవ్​ ఠాక్రే నిరూపించిన్రు. ప్రలోభాలకు గురిచెయ్యడమే బీజేపీ చాణక్య నీతి అనుకుంటే.. అంతకంటే గొప్పగా పొలిటికల్​ గేమ్స్​ ఆడగలమని ఈ రెండు ప్రాంతీయ పార్టీలు చేసి చూపించాయి. అడుగుపెట్టినచోటల్లా ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్న బీజేపీని  పవార్​ దెబ్బతీసిన తీరును దేశమంతా మెచ్చుకుంటున్నది. పవార్​ కొట్టిన దెబ్బకు బీజేపీ ముఖంతోపాటు ఇంకెక్కడో పగిలి విలవిలలాడుతున్నది.

 

ఎన్నికలకు ముందు సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకుందామన్న అమిత్​ షా.. ఫలితాల తర్వాత ఉద్దేవ్​ ఠాక్రేని కాదు పొమ్మన్నాడు. బీజేపీతో కలవడం తప్ప శివసేనకు వేరే ఆప్షన్​లేదని షా భ్రమించిండు. సరిగ్గా అప్పుడే సాటి మరాఠా పార్టీకి ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ సాయంగా నిలబడిండు. రెండు ప్రాంతీయ శక్తులు కలిస్తే జాతీయ మాఫియాను కూడా ఈజీగా దెబ్బకొట్టొచ్చని పవార్​, ఠాక్రే నిరూపించిన్రు. ప్రాంతీయ పార్టీలు కలవడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ.. గవర్నర్​ ద్వారా ఇంకో నాటకానికి తెరలేపింది. రాత్రికిరాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తేసి, తెల్లారేలోపు ఫడ్నవీస్​తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది. ఈ చర్యతో ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత మరింత బలపడింది. గవర్నర్​ వ్యవస్థను బంట్రోతు స్థాయికంటే కిందికి దిగజార్చిన బీజేపీకి సుప్రీంకోర్టు కూడా గట్టిగానే గడ్డిపెట్టింది. మహారాష్ట్ర ఎపిసోడ్​లో సుప్రీంకోర్టు తీర్పు ఊహించిందే అయినప్పటకీ.. 19 పేజీల తీర్పు కాపీలో జడ్జిలు చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాజకీయాలను ఎండగట్టేలా ఉన్నాయి.

 

కేంద్రానికో, వాళ్లు చెప్పినట్టల్లా వినే గవర్నర్లకో నచ్చినట్లు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుకాబోవని సుప్రీం బెంచ్​ స్పష్టం చేసింది.  బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రానికి అనుకూలమైన గవర్నర్లను నియమించి, వాళ్ల ద్వారా అక్కడి ప్రభుత్వాలను ఏదో చేద్దామనుకుంటున్న గుజరాత్​ మాఫియాకు నిజంగా చెంపపెట్టులాంటి వ్యాఖ్యలివి. తెలంగాణలో కూడా కొంత మంది ఎంపీలు ఇక్కడి ప్రాంతీయ అస్థిత్వాన్ని గుజరాత్​ మాఫియాకు తాకట్టుపెట్టి.. రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుండటం, గవర్నర్​ ద్వారా ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్న ప్రస్తుత సందర్భంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు చెప్పడం గమనార్హం. మతం పేరుతోనో, సూడో దేశభక్తి పేరుతోనో ప్రాంతీయ ఆత్మగౌరవం, అస్థిత్వాల్ని దెబ్బతీయాలని చూస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మహారాష్ట్ర ఎపిసోడ్​తో  బీజేపీకి అర్థమైఉండాలి. ఇలాంటి తిక్కవేషాలు ఏ ప్రాంతంలో వేసినా బీజేపీకి, వాళ్లను నడిపించే గుజరాత్​ మాఫియాకి చెప్పులతో సమాధానం తప్పదు!

Top