You are here
Home > Uncategorized > బీజేపీ నేతలారా.. ఇంతకన్నా తెలంగాణకు ద్రోహం ఉంటుందా?

బీజేపీ నేతలారా.. ఇంతకన్నా తెలంగాణకు ద్రోహం ఉంటుందా?

Spread the love

 

బీజేపీ నేతలారా.. ఇంతకన్నా తెలంగాణకు ద్రోహం ఉంటుందా?

– కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్రం ఇచ్చిన గెజిట్ ను స్వాగతిస్తారా?

– డీకే అరుణా, జితేందర్ రెడ్డీ.. మీకు మనస్సాక్షి అంటూ ఉందా?

– తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ఎక్కడికైనా పారిపోండి

తెలంగాణకు కేంద్రం చేయని అన్యాయమంటూ లేదు. ఆపదలో ఆదుకున్న సందర్భం ఒక్కటంటే ఒక్కటీ లేదు. పైగా.. పుండు మీద కారం చల్లినట్టు.. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకే జల వివాదాలు తేల్చే హక్కులు, నీటి వాటాలు తేల్చే హక్కును సంక్రమించేలా చేసి.. మరింత నష్టాన్ని మిగిల్చింది మన మహా మహా మోడీ ప్రభుత్వం. అలాంటి దగుల్బాజీ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంత పాడుతుండడం.. మహా దారుణం.

కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం.. పక్కాగా మరో మోసమే. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని అడ్డుకుని రాజకీయం చేసే ప్రయత్నమే. ఇలాంటి నిర్ణయాన్ని సమర్థించే ఏ నేత అయినా సరే.. తెలంగాణకు వాళ్లు చేసేది దారుణమైన ద్రోహమే. ఈ విషయాన్ని గ్రహించకుండా.. కేంద్రం మంచి డెసిషన్ తీసుకుందని అనేందుకు కనీసం బుద్ధి ఉండాలి. ఆ ఇద్దరికీ పార్టీ ప్రయోజనాలే తప్ప.. తెలంగాణ ప్రయోజనాలు పట్టవని మళ్లీ రుజువైంది.

గతంలో టీఆర్ఎస్ లో పని చేసిన జితేందర్ రెడ్డికి అత్మవంచన చేసుకోవాలని ఎందుకు అనిపించిందో.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణకు చేసిన అన్యాయం డీకే అరుణకు గుర్తుకు వచ్చిందో ఏమో. అందుకే.. పుష్పం మాయలో పడి.. తెలంగాణకు తమ తీరుతో ఈ ఇద్దరు నేతలు కంటకులుగా మారారు. విభజన చట్టం ప్రకారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్న ఈ దుర్మార్గులు.. తెలంగాణ ద్రోహులు.. ఓ ప్రశ్నకు సమాధానమివ్వాలి.

అదే విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలు దక్కాలి. పరిశ్రమలు రావాలి. కోచ్ ఫ్యాక్టరీ రావాలి. విద్యుత్ రంగంలో ఎక్కువ కేటాయింపులు ఉండాలి. ఇందులో.. ఏ ఒక్కటైనా కేంద్రం నెరవేర్చిందా? ఇచ్చిన హామీలే తీర్చడం చేతకాని ఈ పార్టీ.. తెలంగాణకు ఇంతకన్నా మేలు ఏం చేస్తుంది చెప్పండి? అందుకే.. ఇలాంటి తెలంగాణ ద్రోహులను కఠినంగా శిక్షించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వారంతా.. తగిన సమయం కోసం చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టిన అక్రమ ప్రాజెక్టులపై మాట కూడా మాట్లాడని ఈ కేంద్రం, బీజేపీ నేతలు.. మళ్లీ తెలంగాణకు అన్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలను సమర్థించేది లేదని.. కేంద్రానికి, పుష్పాలకు.. తగిన బుద్ధి చెబుతామని.. ఆవేదనతో కూడిన హెచ్చరికను జారీ చేస్తున్నారు.

పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ ఆపేస్తుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై టీఆర్ఎస్ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. విభజన చట్టం ప్రకారమే రివర్ బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు.

క్రిష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీల నీటి కేటాయింపులకు 2015లోనే ఒప్పుకుని కేసీఆర్ దక్షిణ తెలంగాణ నోట్లో మట్టి కొట్టిండు. తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని కూడా కేసీఆర్ ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదు.

Top