You are here
Home > Uncategorized > జనాలకు మొహం చూపించాలంటే.. మీరే సిగ్గుపడాలి..!

జనాలకు మొహం చూపించాలంటే.. మీరే సిగ్గుపడాలి..!

Spread the love

బీజేపీ నేతలే.. ముందుగా సిగ్గుపడాలి.. కారణం ఇదే..!
– చేస్తామని చెప్పిన వాటిలో.. ఒక్క హామీ అయినా తీర్చారా..?
– కేసీఆర్ ను విమర్శించే ముందు బీజేపీ తన చరిత్రను తాను తెలుసుకోవాలి

ప్రధాని మోదీకి మొహం చూపించేందుకు సీఎం కేసీఆర్ సిగ్గు పడుతున్నారని అంటున్న బీజేపీ నేతలారా.. ముందుగా ఆ మాట అన్నందుకు మీరు సిగ్గుపడండి. కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పటికి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటుతున్నా కనీసం 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు సిగ్గుపడండి. నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని చెప్పి.. వాటిని అమాంతం పెంచుకుంటూ పోతున్నందుకు మీరు సిగ్గుపడండి.

చమురు ధరలు తగ్గిస్తామని చెప్పి.. వాటిని అదుపు చేయలేకపోతున్న అత్యంత అరాచకమైన పాలనలో భాగస్వాములైనందుకు మీరు సిగ్గుపడండి. అంతెందుకు.. గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి.. అక్కరకే రాని సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు.. అందరికంటే ముందుగా మీరు సిగ్గుపడండి. తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాకే.. సమాజంలో తిరగండి.

నిజమే.. కోరినప్పుడల్లా కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ.. తెలంగాణ బాగు దిశగా చేసిన విజ్ఞాపనలు, కోరిన నిధులను ఏ మాత్రం ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఎక్కువ శాతం పన్నులు, నిధులను కేంద్రానికి సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. బీహార్ ను, ఆంధ్రప్రదేశ్ ను తోసిపుచ్చి మరీ.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిన సాగు మాగాణం ఉన్న రాష్ట్రం తెలంగాణ.

ఇదంతా.. కేసీఆర్ పరిపాలనతోనే సాధ్యమైంది. ఇదంతా.. బంగారు తెలంగాణ సాధన క్రమంలోనే ఆవిషృతమైంది. రైతు పాలనలో.. సకల వర్ణాలు ఆర్థికంగా వెలిగిపోయేంతగా ఎదగగలిగింది. అందుకే.. ప్రధానిని కలవనందుకు కేసీఆర్ కాదు.. చెప్పిన మాటలు అమల్లోకి తీసుకురాలేనందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలి. జ్వరంతో ఉన్న కేసీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్న ఆ ఎర్రి పుష్పాలే.. అందరికంటే ముందుగా సిగ్గుపడాలి. సిగ్గుపడాలి.

Top