You are here
Home > Uncategorized > మీరు సింహాలు కారు.. గ్రామసింహాలు

మీరు సింహాలు కారు.. గ్రామసింహాలు

Spread the love

 

మీరు సింహాలు కారు.. గ్రామసింహాలు

జనాలను పీక్కుతింటున్న తోడేళ్లు

హుజురాబాద్​లో బీజేపీ గెలుపు కల్ల

హుజురాబాద్​లో బీజేపీ కార్యకర్తలు సింహాల్లా రెచ్చిపోతరట. ప్రతి ఓటు పువ్వుపార్టీకే పడుతదట. బీజేపీ మాజీ లీడర్​ జితేందర్ రెడ్డి పిచ్చిమాటలివి. ఇలాంటి కోతలు కోయడం వల్లనే ఈసారును జనం ఇంటికి పంపిండ్లు. అయినా అధికారం మీద కోరిక పోదు కాబట్టి బీజేపీలో షెల్టర్​ తీసుకున్నాడు. మన రెడ్డిగారు చెబితే కుక్క కూడా పట్టించుకోదు. మన బీజేపీ లీడర్లు సింహాలు కారు. గ్రామసింహాలు! అంటే తెలుసు కదా! కుక్కలు. నక్కలు కూడా. జనాన్ని పీక్కు తింటున్నరు.

ఈ బఫూన్​ బాబు మాటలు వింటే నవ్వాగదు ‘‘ఈటలకు జరిగిన మోసాన్ని కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరించాలి. ఇంత బలగం మనకుండగా.. వాళ్లు డబ్బులెలా పంచుతారో చూద్దాం. మన కార్యకర్తలను ఒక్కరిని అరెస్టు చేస్తే వెయ్యి మంది అండగా ఉండి అరెస్టులకు సిద్ధం కావాలి. టీఆర్ఎస్‌‌లో గుంటనక్కలుంటే మా దగ్గర సింహాల్లాంటి నేతలున్నారు. హుజురాబాద్‌‌లో ఈటల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల ఆత్మగౌరవ కోసం చేస్తున్న పోరు ఇది. ఈ ఎన్నికలో గెలవడం కాదు.. లక్ష మెజార్టీ సాధనే మన ధ్యేయం. నీతివంతమైన ఈటలకు అన్యాయం జరిగింది. బీజేపీ నాయకులు, గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లంతా పాలు, నీళ్లలా కలసి పనిచేయాలి’ అని జితేందర్ అన్నాడు.

ఇది ప్రసంగం విని అక్కడున్నోళ్లంతా కచ్చితంగా నవ్వుకొని ఉంటారు. మోడీ పాలన చూశాక జనానికి బీజేపీపై విరక్తి పుట్టింది. తెలంగాణకు భారతీయ ఝూటా పార్టీ తీరని అన్యాయం చేసింది.  మోడీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా ? ఏ ఒక్క వర్గానికి అయినా మేలు జరిగిందా ? ఇంతటి కష్టకాలంలో రూ.7000 వేల కోట్లు పెట్టి పార్లమెంటును కట్టడం ఏం డెవెలప్​మెంట్​ ? కరోనా కంట్రోల్​ చేయడానికేనా కుంభమేళాలకు పర్మిషన్ ఇచ్చింది ? సెకండ్​ వేవ్​ కు వందశాతం మోడీ విధానాలే కారణం.

జీఎస్టీ, నోట్లరద్దు, పెట్రోల్​ ధరల పెరుగుదల, ఇష్టమొచ్చినట్టు లాక్​డౌన్లు అమలు చేయడం వల్ల దేశం పదేళ్లు వెనక్కి వెళ్లింది. రాజకీయ ప్రత్యర్థులను వేటకుక్కల్లా వేటాడుతున్నారు. గ్యాస్ రేటు రూ.వెయ్యి అయింది. పెట్రోల్​ రేటు రూ.100 అయింది. వంటనూనె రేటిప్పుడు రూ.200. ఇక జనం బతకాలా చావాలా ? దీనికితోడు కరోనా! బీజేపీ పాలిత రాష్ట్రాలకు తప్ప మిగతా వారికి నయాపైసా సాయం చేయడం లేదు. ఎకానమీ దారుణంగా పడిపోయింది. వ్యాక్సిన్లు లేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా ఫస్ట్​, సెకండ్​వేవ్​ లను ఎదుర్కోవడంలో మోడీ ఫెయిలయ్యాడని పిల్లగాడికి కూడా తెలుసు. బీజేపీ వాళ్లు మాత్రం మోడీ వల్ల కరోనా ఫుల్​ కంట్రోల్​లో ఉందని ఇప్పటికీ అబద్ధాలు చెబుతున్నారు. జనం గోస మీకు పట్టదు. మీకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్టేనన్న విషయం జనానికి ఎప్పుడో అర్థమైంది.

 

Top