You are here
Home > National News > మతి ఉండే మాట్లాడుతున్నారా.. కిషన్ రెడ్డీ?

మతి ఉండే మాట్లాడుతున్నారా.. కిషన్ రెడ్డీ?

Spread the love

మతి ఉండే మాట్లాడుతున్నారా.. కిషన్ రెడ్డీ?

తెలంగాణకు నిధులు కోరితే ఇలా మాట్లాడతారా?

తన ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ కోరారా?

అదనంగా ఏం ఇచ్చారనే కదా అడిగేది.. మాత్రం హక్కు మాకు లేదా?

కేంద్రమంత్రిగా ఉన్నాం కదా.. ఏది పడితే అది మాట్లాడితే అంతా తలూపుతారని అనుకుంటున్నారా? గతంలో ఇలాగే ఓ సారి తెలంగాణ గురించి మాట్లాడుతూ ఎర్ర బస్సు అని.. మోదీ వచ్చాకే రైళ్లు, బస్సులు వచ్చాయని అని అభాసుపాలయ్యారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పరువు తీసుకున్నారు. ఆ చరిత్ర మరిచి.. ఇప్పుడు సుద్దులు చెప్పడం ఏ మాత్రం బాగాలేదు కిషన్ రెడ్డీ. కేసీఆర్ మాట్లాడినదాంట్లో తప్పేమైనా చెప్పగలరా అసలు మీరు?

కరోనా వేళ కేంద్రం ఏ మాత్రం సహాయం చేయని మాట ముమ్మాటికీ నిజం. పచ్చి నిజం. నామమాత్రపు నిధులిచ్చి.. పని కానిచ్చేశాం.. మీ ఛావు మీరు ఛావండి అన్నట్టుగా.. కేంద్రం ప్రవర్తించింది. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా… కేంద్రం నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అందుకే.. శివసేన అధికారంలో ఉన్న మహారాష్ట్రలో.. వైసీపీ అధికారంలో ఉన్న ఏపీలో.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో.. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్రమే నిజంగా పట్టించుకుని ఉంటే ఇలా జరిగేదా?

ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ నుంచి కేంద్రం వేలకు వేల కోట్ల రూపాయలను పన్ను రూపంలో కొల్లగొడుతోంది. కనీసం ఆ ఇంగితం గుర్తించైనా.. కనీసం రూపాయైనా ఎక్కువ నిధులు ఇచ్చారా.. అని కేంద్రాన్ని కేసీఆర్ నిలదీశారు. చేతనైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు? కేసీఆర్ అకౌంట్ లో డబ్బులు వేస్తేనే తెలంగాణకు ఇచ్చినట్టా… అని ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం కిషన్ రెడ్డీ?

ఇక ప్రాజెక్టులకు కేంద్రమే అప్పలిస్తోందని గొప్పలు చెప్పుకుంటున్నారే.. తండ్రి స్థానంలో కేంద్రం కాకుంటే ఇంకెవరు ఇస్తారు.. అప్పులు? ఇది కూడా ఇతర రాష్ట్రాలకు భారీగానే ఇస్తున్నారు కదా.. అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరు.. హక్కులు మాట్లాడేవారికి మరో తీరు అంటే కుదరదు గుర్తుంచుకోండి. అది ఇచ్చాం.. ఇది ఇచ్చాం అని చెప్పడం కాదు. మీరు దేశానికి పాలకులు. ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వాల్సిందే. అవసరం ఉన్న వారికి అదనంగా నిధులిచ్చి ఆదుకోవాల్సిందే. అలా కాదూ కూడదూ అంటే.. మీకు ముందు పదేళ్లు పాలించిన కాంగ్రెస్ గతి ఏమైందో చూడండి. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్న వాస్తవాన్న గ్రహించి.. తెలంగాణకు న్యాయం చేసేందుకు ప్రయత్నించండి.

Top