You are here
Home > Latest News > బీజేపీలో గుర్రాలేనా? మనుషులు లేరా?

బీజేపీలో గుర్రాలేనా? మనుషులు లేరా?

Spread the love
  • – తెలంగాణ విజయం అడ్డుకుంటామంటూ బీజేపీ ప్రగల్భాలు
  • – లక్ష్మణ్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై జనం నవ్వులు
  • – ఎలా గెలుస్తారో చూస్తామంటూ కమలానికి ప్రజల హెచ్చరికలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వేసే జోకులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం అని పగటి కలలు కంటున్న ఆయన… గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయాడో చెప్పలేకపోతున్నారు. జంట నగరాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా… ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ సీటును కూడా దక్కించుకోలేకపోయిన అసమర్థతను గుర్తు చేసుకునేందుకూ జంకుతున్నారు.

అంతే కాదు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి… బీజేపీ నేతలు ఒక్కొక్కరుగానే ప్రకటనలు చేస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం స్నేహపూర్వక పోటీపైనా విమర్శలు చేస్తున్నారు. కానీ… ఏనాడూ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ వంటి సీనియర్లు ఒకే వేదికపై కనిపించలేదు. ఎమ్మెల్యేలుగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజీనామా చేసిన రాజాసింగ్ అయితే అడ్రస్ కూడా లేరు.

అలాంటి నేతలు… రాష్ట్రంలో గెలిచి చూపిస్తారట. అధికారంలోకి వస్తారట. ఇలాంటి పిట్టలదొర రాజకీయాలను జనం అసహ్యించుకుంటున్న విషయం ఇంకా బీజేపీ నేతలకు అర్థం అవుతున్నట్టు లేదు. అందుకే… అతి విశ్వాసం, అప నమ్మకాలను కలయికగా చేసుకుంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. లేని వాపును చూపించి… అది రాబోయే గెలుపు అని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ జోకులకు జనం ఓవైపు నవ్వుకుంటూనే… బీజేపీకి గెలిచేంత సీన్ కూడా లేదని… కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో అయినా గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు.

Top