You are here
Home > Uncategorized > బీజేపీ అసలు బాధ ముహూర్తమేనా..?

బీజేపీ అసలు బాధ ముహూర్తమేనా..?

Spread the love

బీజేపీ అసలు బాధ ముహూర్తమేనా..?

వెలుగు పత్రిక చేసే ఏకైక పని…బీజేపీ భావజాలాన్ని శక్తివంచన లేకుండా ప్రచారంచేయడం. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి కొత్త పాలకమండలి ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు బీజేపీనేతలు. వారికి వంత పాడుతూ ప్రత్యేక కథనాలు వండివార్చింది వెలుగు. పాలకమండలి గడువు ముగుస్తుండడంతో కొత్త పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఫిబ్రవరి 11 ఉదయం 11గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఉంటుంది.  ఈ ఎన్నికల నోటిఫికేషన్ పై ఇప్పుడు వెలుగు కొత్త రాగం అందుకుంది. ఫిబ్రవరి 11 అమావాస్యట.

ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి కార్పొరేటర్లు అయిష్టంగా ఉన్నారట. విషయం ఏంటంటే…మేయర్ పీఠంపై కూర్చోవాలని గంపెడాశలు పెట్టుకుంది బీజేపీ. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల తరహాలో అగ్రనేతలు తరలివచ్చి గ్రేటర్ ప్రచారం నిర్వహించారు. ఇంత కష్టపడినా మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సినన్ని సీట్లు సాధించలేకపోయింది. ఇక గెలిచిన కార్పొరేటర్లలో ఎంతమంది ఇంకా పార్టీలో ఉన్నారో…కాషాయదలానికే తెలియదు.

పార్టీ కార్పొరేటర్లగా ఎంతమంది ప్రమాణస్వీకారం చేస్తారనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు. గ్రేటర్ పీఠంపై కూర్చుంటామని బీరాలు పలికన వాల్లకు ఆ పదవి దక్కకపోగా  ఈ పరిణామాలన్నీ ఇబ్బందికరంగా మారాయి. అందుకే పరువు కాపాడుకునేందుకు అమావాస్య అంశాన్ని తెరపైకి తెచ్చారు. గెలిచిన కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం రోజు పార్టీ వెంట లేకపోతే..అమావాస్యను సాకుగా చూపి తప్పించుకోవచ్చు. బీజేపీ నేతల మనసెరిగి ప్రవర్తించే వెలుగు..అందుకే ఇప్పటినుంచే అమావాస్యపై అనవసరపు ప్రచారం ప్రారంభించింది. ఒకవేల వాల్లు కోరినట్టు ఎన్నికల కమిషన్ ప్రమాణస్వీకారం తేదీని మార్చినా…కొత్తగా బీజేపీకి కలిగే ప్రయోజనం ఏమీ లేదు.

కాకపోతే..ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చేసి విమర్శలు గుప్పించడం బీజేపీ నేతలకు పరిపాటిగామారింది. వారి వ్యాఖ్యలకు, ఆలోచనలకు అపరిమిత ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించడం, ప్రసారం చేయడం వెలుగు, వీ6 దినచర్యగా మారిపోయింది. ప్రమాణస్వీకారంలోపు ఇలాంటి ప్రచారాలు ఇంకొన్ని చూడాల్సి రావొచ్చు.

 

 

Top