You are here
Home > Latest News > ముందుగా కేంద్రంతో  శ్వేతపత్రం  విడుదల చేయించు రఘునందన్!

ముందుగా కేంద్రంతో  శ్వేతపత్రం  విడుదల చేయించు రఘునందన్!

Spread the love

ముందుగా కేంద్రంతో   శ్వేతపత్రం  విడుదల చేయించు రఘునందన్!

  • తర్వాత రాష్ట్రంలో కరోనా నిధుల వెచ్చింపు సంగతి చూద్దాం
  • నిర్దోషిత్వం నిరూపించుకునేవరకూ మీడియా ముందుకు రానన్నావ్
  • లైంగిక వేధింపుల కేసు గురించి మాట్లాడుకుందామా మరి.. తర్వాత రాజకీయాలు మాట్లాడుదాం

అప్పట్లో లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.. బీజేపీ నేత రఘునందన్ రావు. ఇప్పుడు చాలా రోజులకు.. మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతన్నారు. కరోనాకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి.. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధుల గురించి.. తెలంగాణ ప్రభుత్వాన్ని శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఇక్కడో విషయాన్ని మనం గుర్తించాలి. కప్పదాటు విమర్శల వెనక ఆంతర్యం గుర్తించాలి.

నిజంగా కేంద్రం అంటూ డబ్బులు ఇచ్చే ఉంటే.. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి అంటూ ఉంటే.. అసలు ఎన్ని డబ్బులు ఇచ్చారు.. వాటిని ఎలా ఖర్చు చేశేలా చర్యలు తీసుకున్నారు అన్నది.. నోటి లెక్కలు కాకుండా.. నేరుగా శ్వేతపత్రాన్ని విడుదల చేసి సవాల్ విసరాలి. అప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విశ్వసనీయత అనేది ఉందని భావించవచ్చు. అలాంటి ప్రయత్నం ఏ మాత్రం లేకుండా.. కేసీఆర్ సర్కారుపై రఘునందన్ విరుచుకుపడితే అర్థం ఉందా?

మరో విషయం. లైంగిక ఆరోపణల కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేవరకూ మీడియా ముందుకు రాను అనీ.. రాజకీయాలు మాట్లాడబోనని.. కూతలు కూసిన రఘునందన్.. మరి బెయిల్ తెచ్చుకున్నాడో.. బెదిరించి కేసును కొట్టేయించాడో తెలియదు కానీ.. సడన్ గా మీడియా ముందుకు వచ్చి.. హాట్ ఫాట్ అన్నట్టుగా ఆవేశంగా మాట్లాడుతన్నాడు. తన పతిత్తు వేషాల గురించి జనాలు మరిచిపోయారని అనుకుంటన్నాడేమో మరి.

ఇంత హీనమైన వ్యవహారాన్ని కేంద్రంలో పెట్టుకుని.. పదే పదే చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న మోదీ ప్రభుత్వానికి.. ఇలాంటి కామాంధులు వంత పాడుతున్న తీరు.. నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. మారండ్రా బాబూ మారండి. అనవసరంగా నోరు పారేసుకోకండి. మీరు చేసిన పాపానికి.. దేశంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటికైనా సమర్థ విధానాలు అవలంబించండి. రాష్ట్రాలను తగిన రీతిలో ముందుకు నడిపించండి.

Top