You are here
Home > Uncategorized > బీజేపీలో మళ్లీ బయటపడ్డ విబేధాలు

బీజేపీలో మళ్లీ బయటపడ్డ విబేధాలు

Spread the love

బీజేపీలో మళ్లీ బయటపడ్డ విబేధాలు

మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుంది. వడ్ల ఇష్యూ తరువాత అయితే బీజేపీ పేరు చెబితేనే జనం ఉమ్మేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ సర్కారు సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. దీంతో బండి ముఠాకు టెన్షన్ మొదలయింది. అందుకే తీన్మార్, విఠల్ వంటి చిల్లరగాళ్లను తీసుకొచ్చి కండువా కప్పుతున్నారు.

మరో సంగతి ఏమిటంటే.. బీజేపీలో కుమ్ములాటలు మరింత పెరిగాయి. తెరాసలో లొల్లి చేసినట్టే బీజేపీలోనూ ఈటల చిచ్చు పెట్టాడు. ఇతడికి, కిచెన్ రెడ్డి, సంజయ్కి అస్సలు పడటం లేదు. పైకి మాత్రమే నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. లోపల మాత్రం ఒకరంటే మరొకడికి మంట. ఈటల చూపుతోన్న దూకుడు పార్టీ నాయకత్వానికి రుచించడంలేదు.

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దూరంగా ఉంటుందని పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెబితే, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈలల రాజేందర్ మాత్రం బాహాటంగా టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీంద్ సింగ్ కు మద్దతు పలకడం పార్టీలో ఆధిపత్యపోరుకు తార్కాణంగా నిలిచింది. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా? లేక ఈటలా? అనే డౌట్ వస్తోంది. ఈటల దూకుడుకు సొంత పార్టీ నేతలే చెక్ పెడుతున్నారు. అందుకే తీన్మార్ మల్లన్న లాంటి కొత్త క్యారెక్టర్లను తెస్తున్నారు. అసలు తెలంగాణలో పార్టీకి పునాదే లేనప్పుడు ఇలాంటి డ్రామాలు ఎన్ని చేసినా ఏం ఫాయిదా ? బండి సంజయ్ బ్యాచ్ గాలిలో మేడలు కడుతోంది.

 

Top