You are here
Home > Latest News

రైతుబంధు, సీఎం కేసీఆర్ పై దుష్ప్రచారం.

  రైతుబంధుపై ఏసియా నెట్ న్యూస్ దుష్ప్రచారం. ధనవంతులు రైతుబంధు చెక్కులు తిరిగివ్వాలన్న... ముఖ్యమంత్రి పిలుపునకు స్పందనలేదని తప్పుడు వార్తలు. 1543మంది రైతులు రైతుబంధు వదులుకున్నారని వీళ్లే రాశారు. కానీ.. కేసీఆర్ పిలుపునకు స్పందన లేదనడం అవాస్తవం, పచ్చి అబద్ధం. దేశంలోనే సాహసోపేత నిర్ణయం.. రైతుబంధు పథకం. పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. పదివేల కోట్లతో ప్రతీ రైతు సాయం అందించింది సర్కారు.

నువ్వు చేసిన నేరమే నిన్ను వెంటాడుతోంది రేవంత్ రెడ్డి.

  ఈడీ కేసుపై సీఎం, ప్రధానిపై నిందలు వేసినంత మాత్రాన.. ఓటుకు నోటు కేసులో నువ్వు దొరికింది అవాస్తవం కాకుండా పోతుందా?. అయినా.. మోడీ, కేసీఆర్ స్థాయికి నువ్వు తగ్గవాడివా?. వాళ్లు ఇద్దరు నీపైన కక్షగట్టేంత సీను నీకు లేదని తెలుసుకో. ఓటుకు నోటు కేసులో దొరికిన ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి. ఈ విషయంలో జైలు జీవితం గడిపొచ్చినా రేవంత్ తీరు మాత్రం మారడం లేదు. ఓటుకు నోటు కేసు..

కేటీఆర్ హరీశ్ ఇద్దరూ సమ ఉజ్జీలే రేవంత్.

  టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్- హరీశ్ ఎవ్వరినీ వేరు చేయలేం. సమర్థత విషయంలో ఎవ్వరు ఎవ్వరికేం తక్కువ కారు. ఒకరికి మాస్ ఫాలోయింగ్ అయితే.. మరొకరికి క్లాస్ ఫాలోయింగ్. పని విషయంలో ఇద్దరూ నిక్కచ్చిగా ఉండే లీడర్స్.. నిజాయితీగా పనిచేసే లీడర్స్. అందుకే వీరిద్దరినీ కేసీఆర్ లెఫ్ట్ హ్యాండ్.. రైట్ హ్యాండ్ అంటారు. తెలంగాణలోనే కాదు.. యావత్ భారతంలో.. టీఆర్ఎస్ పార్టీ అనగానే ముందుగా గుర్తొచ్చేది కేసీఆర్. ఆ తర్వాత ఎవరనే

రైతులపై కోదండరాం మొసలి కన్నీళ్లు.

  నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంది. కాకపోతే.. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామంటే శాంతిభద్రతలకు విఘామని... కొందరు రైతు నాయకులను అరెస్ట్ చేసి.. అదే రోజు సాయంత్రం విడుదల చేశారు. కానీ.. కోదండరాం మాత్రం రైతులను ఏదో చిత్ర హింసలు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. రైతులపై కపట ప్రేమ.. మొసలి కన్నీళ్లు కారుస్తున్న కోదండరాం.. ఆర్మూర్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గతంలో ఇదే పసుపు,

కేంద్రం ఏం ఇచ్చిందని అమలు చేయాలి.

  బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఆయుష్మాన్ భవ, ఆవాస్ యోజనకంటే మించిన పథకాలు.. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి జీవిఎల్ నర్సింహారావు. పథకాల గురించి ఏమైనా నీకు తెలిస్తే.. కేంద్రం, రాష్ట్ర పథకాలను పోల్చిచూడు. రెండింట్లో ఏదో బాగుందో నువ్వే చెప్పు జీవీఎల్. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని అంటున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ముందు రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాల గురించి తెలుసుకుంటే

ఆంద్రా పత్రికల ‘కళ్లు‘ ఓర్వడం లేదు….

ఆంద్రా పత్రికల ‘కళ్లు‘ ఓర్వడం లేదు.... రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం సరిగ్గా అమలు కావడం లేదంటూ ఒక ఆంధ్రాపత్రికలో తప్పుడు కథనాన్ని రాశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఏవో ఒకటి రెండు చోట్ల మినహా ఈ కార్యక్రమం అద్భుతంగా అమలవుతోంది. అంద‌రి చూపూ బాగుండాల‌నే స‌దుద్దేశంతో ప్రారంభించిన 'కంటి వెలుగు'కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం

కోర్టు తీర్పుపై అన్ని వర్గాల విస్మయం

కోర్టు తీర్పుపై అన్ని వర్గాల విస్మయం అసెంబ్లీ సాక్షిగా అసభ్యంగా ప్రవర్తించి శాసనసభ సభ్యత్వాలు పోగొట్టుకున్న కోమటిరెడ్డి, వెంకరెడ్డి కేసులో తాజాగా హైకోర్టులో ఇచ్చిన ఆదేశాలపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పుచేసిన వారిని వదిలేసి అమాయకులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ఏమిటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ధిక్కారం కేసులో విచారణకు రావాలని, లేకుంటే మాజీ స్పీకర్‌ మదసూదనాచారిని అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. డీజీపీ, ఇద్దరు ఎస్పీలు కూడా హాజరుకావాలని అవసరమైతే కేంద్ర

కాంగ్రెస్ కు మళ్లీ పరాభవమే

కాంగ్రెస్ కు మళ్లీ పరాభవమే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ చిత్తుగా ఓడిపోవడం తప్పదని తెలుసు. అయినా తెలంగాణ కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈసారి భారీ సీట్లు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్త కుమార్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లకు కేవలం 28 సీట్లు సంపాదించుకొని పరువు తీసుకున్న ఈ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుస్తుందంటే ఎవరు నమ్ముతారు ? తన ప్రజావ్యతిరేక

అందరి కంటే ముందుగా జైలుకు వెళ్లాల్సింది చంద్రబాబు

అందరి కంటే ముందుగా జైలుకు వెళ్లాల్సింది చంద్రబాబు వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబు తేడాగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతున్నాడు. తానే అవినీతి ఊబిలో కూరుకుపోయి పరాయివాళ్లపై నిందలు వేస్తున్నాడు. కేసీఆర్, మోదీ చెప్పినట్టు నడుచుకోకపోతే జగన్ జైలుకు వెళ్లక తప్పదని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ పై అవినీతి కేసులు ఉన్న మాట నిజం. అయితే వాటిలో ఏ ఒక్కటీ నిరూపితం కాలేదు. జగన్ కంటే ముందే చంద్రబాబుపై వందల అవినీతి

రాహుల్ గాంధీ ప్రధాని కావడం కాంగీల‌కు కలగానే మిగిలిపోతుంది.

  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేత‌లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పనున్నారు. వచ్చే ఎన్నికల్లో 16 సీట్లను టిఆర్ఎస్కే కట్టబెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న జనం. సీఏం కెసిఆర్ పై అచంచల విశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రజలు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక‌, తీరిగ్గా నిన్న సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఓటమిపై అంతర్మధనం చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరైన

Top