You are here
Home > Latest News > కేంద్రం చేస్తున్న మోసాలపై.. బహిరంగ చర్చకు బీజేపీ నేతలు సిద్ధమేనా?

కేంద్రం చేస్తున్న మోసాలపై.. బహిరంగ చర్చకు బీజేపీ నేతలు సిద్ధమేనా?

Spread the love

ఓట్లు అడిగేందుకు.. వాళ్లకు సిగ్గూశరం ఉండాలె!
_ హుజురాబాద్ లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు?
_ ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ పోతున్న మీరు.. ప్రజల జీవితాలను ఎలా బాగు చేయగలరు?
_ కేంద్రం చేస్తున్న మోసాలపై.. బహిరంగ చర్చకు బీజేపీ నేతలు సిద్ధమేనా?

నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయలేకపోతున్నారు. గ్యాస్ సబ్సిడీ దాదాపుగా ఎత్తేశారు. చమురు ధరల సంగతి చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాలకు నిధుల అందజేతలో నిర్లక్ష్యం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతగా దగా.. మోసం.. కుట్ర.. దోపిడీ.. దగుల్బాజీ పాలన.. రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలు.. హుజురాబాద్ లో ఓట్లు ఎలా అడుగుతున్నారు అని అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఓవైపు ప్రజలను మోసం చేస్తూ.. మరోవైపు హామీలు విస్మరించి వెన్నుపోటు పొడుస్తూ.. తిరిగి హుజూరాబాద్ వేదికగా సత్య పూస మాటలతో.. ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. అదే బీజేపీ నేతల అధికార కాంక్ష. ఇన్నేళ్ళ పాలనలో ఒక్కసారైనా ప్రధాని మోడీ చేసిన మంచి పని ఏమైనా ఉందా? వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామన్నారు… అలా కాదూ కూడదంటే రాష్ట్రాలకు ప్రయోజనాలు అడ్డుకుంటున్నారు.

వడ్లు కొనేది లేదని ఎదిరిస్తున్నారు. సోదాలతో బెదిరిస్తున్నారు. మద్దతు ధర ఇవ్వరు. చమురు ధరలు పెంచి ట్రాక్టర్ల నిర్వహణను భారం చేసి రైతుల నడ్డి విరుస్తారు. రైతులనే కాదు.. ఇతర వర్గాల ప్రజానీకాన్ని కూడా.. ఇలాగే అడ్డగోలుగా.. నిర్లజ్జగా.. నిస్సిగ్గుగా మోసం చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై హుజురాబాద్ ప్రజలు బిజెపి నేతలను నిలదీస్తున్నారు.

గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. గెలిపించిన తర్వాత ఏమీ చేయకుండా.. రకరకాలుగా ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా హుజురాబాద్ ఓటర్లు సైతం ఇదే భావనలో ఉన్నారు. అందుకే తమ నియోజకవర్గంలో ఓట్లు అడిగే అర్హత బీజేపీ నేతలకు.. ఆ పార్టీ అభ్యర్థికి లేనే లేదని హుజురాబాద్ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఓట్లు అడగడానికి కూడా తమ వద్దకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఈ విషయంపై బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు.

Top