You are here
Home > Latest News > చింతపండు ఎందులో చేరితో ఏముంది ?

చింతపండు ఎందులో చేరితో ఏముంది ?

Spread the love

చింతపండు ఎందులో చేరితో ఏముంది ?

బీజేపీతో ఊదు కాలేది లేదు పీరి లేసేది లేదు

గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. తీన్మార్​ మల్లన్న బీజేపీలోకి వెళ్డంళాటూ వచ్చిన వార్తలు చూశాక తెలంగాణవాదులకు గుర్తుకు వస్తున్న సామెత ఇది. చింతపండు నవీన్​ ఎలియాస్​ తీన్మార్​ మల్లన్న మొదటి నుంచి బీజేపీ కోవర్ట్​ అన్న విషయం దునియా మొత్తానికి తెలుసు. పువ్వుపార్టీ ఇచ్చే డబ్బుతో అతడు మీడియాను నడుపుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు జర్నలిస్టు ముసుగు తీసేసి డైరెక్ట్​గా భారతీయ బద్మాష్ పార్టీలో చేరాడు. ఈమాత్రం దానికే అన్నా హజారే వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నట్టు సంజయ్​, అరవింద్ బిల్డప్ ఇస్తున్నారు. ఒక చిన్నస్థాయి జ్యోతిష్యుడిని బెదిరించి డబ్బు గుంజే చీప్​ మెంటాలిది ఇతనిది. తన దగ్గర పనిచేసే ఆడవారిని వేధించే దుర్మార్గపు మనస్తత్వం. బీజేపీ వేసే ఎంగిలిమెతకుల కోసం తన వృత్తిని అమ్ముకున్న నీచమైన క్యారెక్టర్​. జర్నలిస్టు పేరు చెప్పుకొని ఎన్నో గలీజ్ దందాలు చేశాడు. ఆఖరుకు చిప్పకూడు తిన్నాడు. భవిష్యత్​లోనూ జైలుశిక్ష తప్పదు.

ఇలాంటి వ్యక్తి చేరిక వల్ల బీజేపీ బావుకునేది ఏమీ లేదు. తెరాస నష్టపోయేదీ ఏమీ లేదు. ఇక విఠల్ సంగతి చూద్దాం. ఇతడు​ కూరలో కరివేపాకు లాంటోడు. ఉద్యమంలో పీకింది చాలా చాలా తక్కువ. కొందరు ఉద్యోగులకు తప్ప జనానికి అసలు ఈ మనిషి పేరే తెలియదు. అందుకే కేసీఆర్ లైట్​ తీసుకున్నాడు.

తీన్మార్​, విఠల్​ వీళ్లిద్దరూ జస్ట్​ ఒక సర్పంచ్​స్థాయి నాయకులు. వీళ్లు ఎక్కడున్నా ఏ పార్టీలో చేరినా కేసీఆర్​ వెంట్రుక కూడా పీకలేరు. తీన్మార్​ బాగోతం అందరికీ తెలిసిపోయింది. మొదట్లో ఈయన మాటలను జనం నమ్మారు కానీ ఇతనో పెద్ద బ్లాక్ మెయిలర్ అని, బీజేపీకి కోవర్ట్​ అని తెలిశాక క్యూ న్యూస్​ యూట్యూబ్​ చానెల్​ను కుక్క కూడా కేర్​ చేయడం లేదు.

Top