You are here
Home > Latest News > ప్లాంటును గుట్టలో కాకుంటే.. జగిత్యాలలో పెట్టమంటవా జీవన్ రెడ్డీ?

ప్లాంటును గుట్టలో కాకుంటే.. జగిత్యాలలో పెట్టమంటవా జీవన్ రెడ్డీ?

Spread the love

ప్లాంటును గుట్టలో కాకుంటే.. జగిత్యాలలో పెట్టమంటవా జీవన్ రెడ్డీ?

  • హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న యాదగిరిగుట్టులో విద్యుత్ ప్లాంట్ పెడితే నష్టం ఏంటి?
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు.. వాస్తవాలు తెలుసుకునే ఇంగిత జ్ఞానం లేదా?
  • కేంద్రానికి టీఆర్ఎస్ అండగా ఉంటే.. విద్యుత్ చట్ట సవరణను ఇంతగా వ్యతిరేకిస్తారా?

జీవన్ రెడ్డి మాట్లాడేది ఏదైతే ఉందో… అది చాలా ముచ్చటగా.. ఉంటుంది. నవ్వుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఎందుకంటే.. ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి మరి. కేంద్రాన్ని నేరుగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పట్టుకుని.. మీరు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు.. అని అంటాడాయన. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న యాదగిరి గుట్టలో విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే.. అక్కడే ఎందుకు అని ప్రశ్నిస్తాడాయన.

రామగుండంలో వేలాది ఎకరాల బొగ్గు ఉండగా.. యాదగిరి గుట్టలో ప్లాంట్ ఎందుకూ అని ప్రశ్నిస్తున్న జీవన్ రెడ్డి.. రాజధానిని విశ్వ నగరం చేసే క్రమంలోనే ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకుందని గ్రహించలేకపోతున్నాడు. నగరానికి దగ్గర్లో ప్లాంట్ అందుబాటులో ఉంటే.. ప్రజలకు, పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎలాంటి లోటు ఉండబోదన్న వాస్తవాన్ని ఆయన ఆర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ ప్రతిపాదనను విమర్శిస్తున్నాడు.

విద్యుత్ చట్ట సవరణలపై.. బయటికి వ్యతిరేకిస్తూ లోపల మాత్రం మద్దతిస్తారని అంటున్నాడు. అదే నిజమైతే.. ఇంత బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంతో ఎందుకు ఈ విషయంలో ఘర్షణ పడుతుందో జీవన్ రెడ్డే చెప్పాలి మరి. అంతేనా.. ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్సే అని.. సాగుకు ఉచిత విద్యుత్ ను ఇచ్చింది తామే అని అంటున్న ఆయన.. సాగుకు ఆనాడే 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి.

ప్రాజెక్టులు కట్టించింది వాళ్లే అయితే.. ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. విద్యుత్ వెలుగులకు వారే కారణం అయితే.. ఆనాడే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జీవన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై మాత్రం నిందలు వేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న జనం మాత్రం.. మాకు నిజాలు తెలుసు.. జీవన్ రెడ్డిది అంతా చాదస్తం.. అధికారంపై ఆరాటం తప్ప మరేదీ లేదు అని జనం అంటున్నారు.

Top