You are here
Home > Uncategorized > ఈ ఠాకూర్ ఎవడ్రా బాబూ.. చాలా డిఫరెంట్ గా ఉన్నాడు!

ఈ ఠాకూర్ ఎవడ్రా బాబూ.. చాలా డిఫరెంట్ గా ఉన్నాడు!

Spread the love

ఠాకూర్ ఎవడ్రా బాబూ.. చాలా డిఫరెంట్ గా ఉన్నాడు!

  • రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ వింత పోకడ
  • శాసనసభపై కాకుండా.. సెక్రటేరియట్ పై పార్టీ జెండా ఎగరేస్తాడంట
  • పరిపాలన కేంద్రంలో పార్టీ జెండా ఎగరేయడం ఏంటంటున్న జనాలు

రాష్ట్ర కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించేందుకు మరో నేత.. మాణికం ఠాకూర్ సిద్ధమయ్యాడు. రాహుల్ గాంధీ బ్యాచ్ అనుకుంటా. ఆయనలాగే గందరగోళంగా మాట్లాడేస్తున్నాడు. అలా ఛార్జ్ తీసుకోగానే.. ఇలా పీసీసీ నేతలతో మీటింగ్ పెట్టేశాడు. ఇలాంటి నేత ఎవరైనా ఏం కోరుకుంటారంటే.. పరిపాలనకు, అధికారానికి కేంద్రమైన శాసనసభలో పార్టీకి మెజారిటీని, ఆధిక్యాన్ని.. వాటితో ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని. కానీ.. ఈయనేందో వెరైటీగా ఉన్నాడు.

సెక్రటేరియట్ పై పార్టీ జెండా ఎగరేయాలని అంటున్నాడు. సెక్రటేరియట్ అంటే.. పూర్తిగా పరిపాలన వ్యవస్థ, అధికార కార్యకలాపాలకు కేంద్రం. ఎన్నికలూ గట్రా ఏమీ ఉండవు. అలాంటి చోట పార్టీ జెండా ఎగరేయడం ఏంటి.. అన్నదే పార్టీ నేతలు, కార్యకర్తలకు, ఆఖరికి జనానికికూడా అర్థం కాలేదు. ఈయన కూడా.. రాహుల్ గాంధీ తరహాలోనే అయోమయం క్యాండిడేట్ అయి ఉంటుందని అంతా ఫిక్స్ అవుతున్నారు.

ఇలాంటి నాయకుడు.. తనకేం తెలుసని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడో.. అసలు దుబ్బాక ఉప ఎన్నిక గురించి ఆయనకేం తెలుసో.. అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నది కూడా తెలుసో లేదో… అని కాంగ్రెస్ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. ఇక కార్యకర్తలైతే.. ఇలాంటి నాయకుడితో మనకు పని లేదు.. మన దారి మనం చూసుకుందాం అని ఫిక్స్ అయితున్నారట.

ఇదంతా చూస్తుంటే.. రాష్ట్ర కాంగ్రెస్ లో లేని పోని గందరగోళం మరోసారి మొదలైనట్టే కనిపిస్తోంది. మాణికం ఠాకూర్.. దిశానిర్దేశంలో పార్టీ మరింత పతనం కావడం ఖాయమన్న మాట.. కాంగ్రెస్ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. ఇలాంటి డిఫరెంట్ కన్ఫ్యూజన్ మెంటాలిటీ.. కేసీఆర్ వంటి బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో నిలబడలేదన్న అభిప్రాయం సైతం.. ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది.

Top