You are here
Home > Latest News > ఇది తెలంగాణరా బై.. కరోనా గిరోనా జాన్తా నై

ఇది తెలంగాణరా బై.. కరోనా గిరోనా జాన్తా నై

Spread the love

ఇది తెలంగాణరా బై.. కరోనా గిరోనా జాన్తా నై

  • యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం
  • అధికారులు, వైద్య సిబ్బంది సమర్థ కార్యాచరణ
  • ఇతరులకు ఆదర్శంగా నిలిచే రీతిలో కరోనా వైరస్ నివారణ
  • వ్యాధి సోకిన వ్యక్తికి పోయిన కరోనా లక్షణాలు

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. తెలంగాణలో తోక ముడిచింది. కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేసిన చర్యలు.. తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. కరోనా సోకిన వ్యక్తి కూడా.. ఆ మహమ్మారి నుంచి విముక్తుడయ్యాడు. అయినా అతడి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్క అతడి విషయంలోనే కాదు.. విదేశాల నుంచి వస్తున్నవారు.. వారితో కలిసిన వాళ్లు.. అందరినీ పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్న కారణంగానే.. ఇంతటి ఉన్నత ఫలితాలు వస్తున్నాయి.

మనకు సమీపంలోని దక్షిణ భారత రాష్ట్రం కేరళను గమనిస్తే.. అక్కడ వరుసగా ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆఖరికి సినిమా హాళ్లను ఈ నెలాఖరు వరకు మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ.. మన దగ్గర మాత్రం గత 15 రోజుల్లో 41 వేల 102 మందిని ప్రభుత్వం పరీక్షించింది. 2 వేల 777 మంది అనుమానితులను గాంధీకి తరలించింది. అంతే కాదు.. విమానాశ్రయాల్లో ఉన్న వైద్య సిబ్బందిని 4 రెట్లు పెంచింది. అడుగడుగునా ప్రజలకు అవగాహన కల్పించింది. పుణె వైరాలజీ తరహాలో ఓ ల్యాబ్ ఇప్పటికే పని చేస్తుండగా.. మరోటి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

కరోనా అనుమానిత పరీక్షల కోసం ఇప్పటివరకూ పుణెకు శాంపిల్స్ పంపిస్తుండగా.. ఆ అవసరం రాకుండా మన దగ్గరే చేయించే ఏర్పాట్లు వచ్చేశాయి. అలాగే.. ప్రజల్లో వైరస్ విస్తృతిపై అవగాహన కలిగేలా చేసి.. ముందుజాగ్రత్తగా లక్షలాది మాస్కులను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ దిశగా.. యశోద దవాఖాన యాజమాన్యం కూడా తన వంతు శ్రమించి.. 2 లక్షల మాస్కులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇతర సంస్థలూ సమయానికి స్పందించి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.

ఇంత సమష్టిగా కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన కసరత్తు.. తీసుకున్న జాగ్రత్త చర్యలు ఫలించాయి. కరోనా బారిన పడకుండా.. తెలంగాణ జాగ్రత్తగా ఉంది.

Top