You are here
Home > Uncategorized > సిగ్గులేని నారాయణ వయసుకు తగ్గట్టు మాట్లాడు ..

సిగ్గులేని నారాయణ వయసుకు తగ్గట్టు మాట్లాడు ..

Spread the love

 

  • బెదిరింపు రాజకీయాలు చేసే మీరే అవినీతి పరులు నారాయణ.
  • సిగ్గులేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్ట్ చేయాలంటావా?.
  • అవినీతి పరులంటూ ఆరోపణలు చేస్తావా??. నీ దగ్గర ఏం ఆధారాలున్నాయి.
  • బూజుపట్టిన కమ్యూనిస్టు భావాల్ని తెలంగాణ ఎప్పుడో బొందపెట్టింది.
  • అయినా.. సిగ్గులేకుండా, ఇంకా కుళ్లు రాజకీయాలు ఎందుకు నారాయణ?.

తెలంగాణ ప్రజలు దేవుడిలా కొలిచే ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న సీపీఐ నారాయణ నీకసలు సిగ్గుందా అని అడుగుతున్నాం?. ఏం ఆధారాలతో కేసీఆర్ అవినీతి చేశారని మాట్లాడుతున్నవ్. డిఫమేషన్ యాక్ట్ కింద కేసు వేస్తే.. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త. నోటికి ఎంతొస్తే.. అంత వాగడం కాదు.. ముందు వెనక ఆలోచించుకోవాలి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావ్.. ఎవరిమీద ఆరోపణలు చేస్తున్నావ్ అన్న సోయిలేకుండా మాట్లాడితే.. జనాలే తరిమి తరిమి కొడతారు జాగ్రత్త నారీ.

మోడీ, అమిత్ షా చెప్పుచేతల్లో కేసీఆర్ నడుస్తున్నారా?. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయాలని ప్రచారం చేస్తుంటే.. నీకు మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏ విధంగా అనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మిమ్మల్ని సంప్రదించలేదని.. కమ్యూనిస్టు పార్టీలను దగ్గరకు రానివ్వడం లేదని.. మీ బెదిరింపు రాజకీయాలు తెలంగాణలో బందుపెట్టారని కక్షగట్టి సీఎం కేసీఆర్ మీద నారాయణ ఆరోపణలు చేస్తున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లు.. ప్రజల కోసం కష్టపడే నాయకుల మీదే రాజకీయ ఆరోపణలు, విమర్శలు రావడం కామన్.

ఎవరు ఏంటనేది.. ఒక్క తెలంగాణయే కాదు.. యావత్ భారతం క్షుణ్ణంగా గమనిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు, పరిపాలన బాగుందని.. యావత్ దేశం కీర్తిస్తుంటే.. తెలంగాణలో అడ్రస్ లేని పార్టీ నాయకులు వచ్చి కేసీఆర్ మీద విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుంది. కేసీఆర్ చిటికె వేస్తే.. తునాతునకలు అయ్యే నాయకులు.. ప్రజారంజక పాలన చేస్తున్న వారిపై విమర్శలు చేయడం దుర్మార్గం. రాజకీయ ఎదుగుదల కోసం.. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నారాయణ విమర్శలు చేస్తున్నారే తప్ప.. అందులో ఎటువంటి వాస్తవం లేదు. అన్నీ సత్యదూరపు మాటలే ఉన్నాయి.

Top