You are here
Home > Latest News > కేసీఆర్ అమ్ములపొదవి నుంచి మరో సంక్షేమ బాణం.. దళిత బంధు!

కేసీఆర్ అమ్ములపొదవి నుంచి మరో సంక్షేమ బాణం.. దళిత బంధు!

Spread the love

 

కేసీఆర్ అమ్ములపొదవి నుంచి మరో సంక్షేమ బాణం.. దళిత బంధు!

 

– యావత్ దేశానికే సంక్షేమ బాటను చూపే మరో అద్భుత పథకం

– లక్షల మందికి ప్రత్యక్ష లాభం చేకూర్చేలా.. దళిత బంధుకు రూపకల్పన

– తమ తలరాతలు బాగుపడడం ఖాయమంటున్న దళిత జనం

దళితులు.. జయహో కేసీఆర్ అంటున్నారు. దళిత సాధికారత పథకం అమలు చేస్తానని గతంలో చెప్పిన సీఎం.. తాజాగా ఆ పథకాన్ని పట్టాలు ఎక్కించేందుకు నడుం కట్టారు. ఈ పథకానికి “తెలంగాణ దళిత బంధు” అని నామకరణం సైతం చేశారు. దేశంలో ఏ ప్రభుత్వమూ.. కనీసం కలలో సైతం ఊహించని.. అమలు చేసేందుకూ ధైర్యం చేయని ఈ పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు.

ఎవరైనా ఊహించగలరా..? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వంద మంది అతి పేద దళితుల కుటుంబాలను ఎంపిక చేసి.. ప్రతి కుటూంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేసి.. వారి ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుందని.. కనీసం ఎవరైనా కల కనగలరా? ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప సంక్షేమ రాజకీయాలు ఇంతగా చేయడాన్ని కనీసం ఇప్పటివరకూ ఎవరైనా చూసి ఉంటారా? అలా చూసి ఉంటే.. దళితుల జీవితాలు ఇలా ఉండేవా?

అలా… నిర్లక్ష్యం ప్రదర్శించే నేత కేసీఆర్ కానే కాదు. ఇప్పటివరకూ.. సబ్ ప్లాన్ నిధులు కావచ్చు.. పథకాలు కావచ్చు.. పింఛన్లు కావచ్చు.. రైతు బంధు కావచ్చు. ఇలా ఏ స్కీమ్ చూసినా.. ప్రథమ ఫలితాన్ని దళితులకే అందిస్తూ.. వారి జీవితాలు బాగు చేస్తూ వచ్చారు. దళిత చిన్నారుల కోసం ప్రత్యేకంగా వందలాదిగా ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి.. వారికి అంతర్జాతీయ స్థాయి విద్య అందించి.. అంబేడ్కర్ కలలుగన్న సామ్రాజ్యాన్ని సాధించే దిశగా శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ఇంకా సంక్షేమ ఫలాలు అందకుండా.. అట్టడుగు స్థాయి జీవన ప్రమాణాలతో బతుకున్న దళితులకు మరింత తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి నడుం కట్టారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం వంద చొప్పున కుటుంబాలు గుర్తించి.. వారికి 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించనున్నారు. ఈ లెక్కన.. 119 నియోజకవర్గాలకు.. 11, 900 కుటుంబాలు.. ఈ భారీ మొత్తాన్ని అందుకోనున్నాయి.

ఒక్కో కుటుంబానికి కనీసం 10 మందిని అనుకున్నా.. కనీసం లక్ష మందికి పైగా ఈ నిధులతో లాభం పొంది.. జీవితాలు మార్చుకోనున్నారు. ఇంతటి సమున్నత పథకాన్ని దేశమంతా అమలు చేయాలని దళితులు అంటున్నారు. తమపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ కు.. తమ గుండెల్లో చోటును మరింత పదిలం చేస్తామని ఆశీర్వదిస్తున్నారు.

Top