You are here
Home > Latest News > నీకు ఏ రోగం ఉండి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లావు అరుణ

నీకు ఏ రోగం ఉండి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లావు అరుణ

Spread the love

కేసీఆర్ కు మానసిక రోగం : డీకే అరుణ

  • నీకు ఏ రోగం ఉండి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లావు అరుణ
  • ముఖ్యమంత్రిని పట్టుకొని రోగం గీగం అంటావా?
  • ఇదేనా నీకు ఉన్న రాజకీయ అనుభవం
  • ఇదేనా నీకు తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి

అరుణ.. నువ్వు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ కోసం ఏం చేశావు చెప్పు. ఏం చేయలే.. నిన్ను నువ్వు కాపాడుకున్నావు.. అంటే మంచిగా సంపాదించుకున్నావు. తెలంగాణ దాకా ఎందుకు కనీసం నీ జిల్లాను పట్టించుకున్నావా? పాలమూరు జిల్లా నీళ్లు లేక అల్లాడి పోతే ఏనాడైనా నీకు జిల్లాను ఆదుకోవాలని అనిపించలేదు కదా. సాగు నీరు లేక.. వ్యవసాయం చేయలేక… పాలమూరు వాసులంతా పట్టణాలకు వలస పోతుంటే అప్పుడు ఏం చేశారు మీరు. చోద్యం చూశారు. అప్పుడు మీకు తెలంగాణ సంక్షేమం గుర్తుకు రాలేదు. మనకు అన్నం పెట్టే రైతన్న గుర్తుకు రాలేదు. తెలంగాణను మాత్రం నాశనం నాలుగు బాల్లు చేశారు.

కానీ.. ఇప్పుడు చూడు.. పాలమూరును ఒకసారి మళ్లీ అవే కళ్లతో చూడు అరుణ. నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీని చూసుకున్నావు. నువ్వు పార్టీలు మారినా.. నీ ప్రాంతాన్ని పట్టించుకోవనే విషయం అందరికీ తెలుసు. అందుకే.. నిన్ను మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు.

కేవలం ఐదేళ్లలోనే పాలమూరు ఎలా అయిందో చూడు. ఇప్పుడు సాగు నీరు వచ్చింది. అన్ని వసతులు వచ్చాయి. పాలమూరు ఇప్పుడు మరో కోనసీమలా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ ఐదేళ్లలో చేశారు. కానీ.. మీరు మాత్రం 40 ఏళ్లు పాలించి ఏం చేశారు.

తెలంగాణకు పెద్దదిక్కుగా ఉంటూ.. తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కు మానసిక రోగం అంటూ పిచ్చి కూతలు కూస్తున్నావు. ఇదేనా నీ రాజకీయ అనుభవం. ఇలాగేనా నువ్వు మాట్లాడేది. కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అరుణ. నీ ఏ రోగం ఉండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరావు.

ప్రజా శ్రేయస్సు కోసం.. ప్రజలకు సరైన పాలన అందించడం కోసం సీఎం కేసీఆర్ కొత్త భవనాలు కడుతుంటే దాన్ని కూడా మీరు ఓర్వలేకపోతున్నారంటే.. మీ కడుపులో తెలంగాణ మీద ఎంత కుళ్లు ఉందో అర్థం అవుతూనే ఉంది. అందుకే.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఘోరంగా ఓడిస్తున్నారు. ఓడిస్తూనే ఉంటారు.

Top