You are here
Home > Uncategorized > అరెస్టులు కాదమ్మా.. అది శాంతిభద్రతల పరిరక్షణ

అరెస్టులు కాదమ్మా.. అది శాంతిభద్రతల పరిరక్షణ

Spread the love

అరెస్టులు కాదమ్మా.. అది శాంతిభద్రతల పరిరక్షణ

అరుణమ్మా.. గతం మరిచావా.. గజినీలా మాట్లాడుతున్నావ్

అరెస్టులుకాల్పులు అంటే ఏంటో నీకు తెలియదా?

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, ఉద్యమాన్ని అణచినప్పుడు ఏమైందమ్మా.. మాట?

పాపం డీకే అరుణ. గజినీ అరుణగా మారిపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా ఓ వెలుగు వెలిగారామె. తర్వాత విధిలేక.. రాజకీయ గతి లేక.. బీజేపీలో చేరి.. ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. విమోచన దినం గురించి మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని అంటున్నారు. అసలు ఏం ఉద్యమం చేశావమ్మా నువ్వూ? ప్రజలు పిట్టల్లా తెలంగాణ కోసం స్వీయ బలిదానం చేసుకుంటుంటే.. చూస్తూ కూర్చున్న నాటి కాంగ్రెస్ నేతల్లో మీరూ ఒకరు కాదా?

పదేళ్లు కాలయాపన చేసి చేసి.. వేలాది మంది అమరులు కావడానికి కారకులైన వారిలో మీరు లేరా? ఆనాడు ఉద్యమాన్ని అణచడానికి మీరు మంత్రిగా అధికారాన్ని వెలగబెట్టిన ప్రభుత్వం.. ఎన్ని అరెస్టులు చేసింది.. జై తెలంగాణ అన్నందుకు ఎంతగా అణచివేసింది? ఇవన్నీ.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లగానే మీరు మరిచిపోయారేమో కానీ.. ప్రజలు మాత్రం మరవలేదు. అందుకే.. అసలు ఉద్యమం అంటే తెలుసా.. అని అడుగుతున్నారు.

విమోచన దినోత్సవం గురించి ఇంతగా గొంతు చించుకోవాల్సిన అవసరం లేదమ్మా అరుణమ్మా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మీరు అంతగా వెలగబెట్టింది ఏం లేదన్నది గుర్తుంచుకోండి. మీలాంటి నేతలు కాషాయం ముసుగులో ఉన్న శాంతి భద్రతలను కూడా చెరిపేస్తారమో అన్న ఆందోళనతోనే పోలీసులు తాత్కాలికంగా అదుపులోకి తీసుకుంటున్నారు.. తర్వాత ఫార్మాలిటీ చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. అంతే కానీ.. నిర్బంధాలు.. అరాచకాలు ఇప్పుడు తెలంగాణలో భూతద్దం వెతికి చూసినా దొరకవు అరుణమ్మా.

ఇప్పుడు ఏం ఉద్యమం చేస్తున్నారో… దాని వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉందో చెబితే.. ఆ తర్వాత స్పందిస్తామని ప్రజలు చెబుతున్నారు. జరిగే కార్యక్రమాలను జరగనివ్వాలని అన్ని పార్టీలకు వారు సూచిస్తున్నారు. అంతే కానీ.. అనవసరమైన విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని చూస్తే.. వచ్చే లాభం కంటే.. జరిగే నష్టం కూడా ఎక్కువగా ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తించి విమర్శలు చేయాలని హితవు పలుకుతున్నారు.

Top