You are here
Home > Uncategorized > సీఎం పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.

సీఎం పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.

Spread the love
  • సీఎం పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.
  • కాంగ్రెస్ లో ఉండగా అదేపాట.. ఇప్పుడూ అదేనా?.
  • నిరంకుశ పాలన ఎక్కడిది డీకే అరుణ.
  • గద్వాలలో గడీల పాలన చేయబట్టే నిన్ను తరిమికొట్టారు.
  • అయినా సిగ్గులేకుండా ఇంకా ప్రభుత్వంపై విమర్శలా?.

సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని మాట్లాడుతున్న డీకే అరుణ నీకంత సీన్ లేదని తెలుసుకో. ప్రజల్లో నీకు ఆదరణ లేదు.. నువ్వు చెప్పే మాటలు ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. కాంగ్రెస్ లో ఉండగా ఇదే పాట పాడితే.. గద్వాల నుంచి నిన్ను ఇంటికి సాగనంపారు. అయినా సిగ్గు లేకుండా ఇంకా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నావా?. ఆర్టీసీ సమ్మెను సాకుగా చేసుకుని బీజేపీ ఎన్నో ఆందోళనలు చేసింది. కమలం నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ అవేమీ ప్రజల ముందు పనికిరాలేదు.

సమ్మె జరుగుతున్నప్పుడు వచ్చిన.. హుజూర్ నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించబోతోంది. అంటే ప్రజలు ఎవరిని విశ్వసించినట్లు.. ఎవరిని చీదరించుకున్నట్లు. కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని మాట్లాడుతున్న డీకే అరుణ.. అలా అయితే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓడాలి కదా?. ఆర్టీసీ కార్మికులది న్యాయమైన సమ్మె అయితే.. ప్రజలు వాళ్లవైపు నిలబడాలి కదా?. ప్రభుత్వం పక్షానే ప్రజలు నిలబడ్డారు, టీఆర్ఎస్ కు ఓట్లు వేశారంటే.. కార్మికులది అసంబద్దమైన సమ్మె అని ప్రజలు తేల్చి చెప్పినట్లే కదా.

సీఎం కేసీఆర్ ప్రజా రంజక పాలన చేయడంతోనే మరోసారి టీఆర్ఎస్ పక్షాన్నే ప్రజలు నిలబడ్డారు. అందుకు నిదర్శనం రేపు హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరడమే. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నీ ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నది తేట తెల్లమైంది. పార్టీల మెప్పుకోసం కాదు.. ప్రజల మెప్పుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని.. జనం అనుకుంటున్నారు. సో.. ఎవరెన్ని విమర్శలు చేసినా డోంట్ కేర్. ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పనిచేస్తారు.

Top