You are here
Home > Uncategorized > డి.శ్రీనివాస్​.. నీకు తోక తెల్వది.. తొండం తెల్వది

డి.శ్రీనివాస్​.. నీకు తోక తెల్వది.. తొండం తెల్వది

Spread the love

 

  • డి.శ్రీనివాస్​.. నీకు తోక తెల్వది.. తొండం తెల్వది
  • అభివృద్ధిలో హైదరాబాద్​ నంబర్​వన్​
  • ఐటీ, ఫార్మా, ఏవియేషన్​ హబ్​ మార్చిన ఘనత తెరాసదే

అవినీతి, అసమ్మతి రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం, అహకారం వంటి లక్షణాలు పుష్కలంగా డి.శ్రీనివాస్​ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. కన్నతల్లి వంటి పార్టీని మోసం చేసిన నీచుడు. కాంగ్రెస్​ను నిండా ముంచిన ఘనత ఈ ముసలోడిదే! ఎంపీ పదవిని ఇప్పించిన తెరాసను తన కొడుకు అర్వింద్​ కోసం విమర్శిస్తున్నాడు. నిజామాబాద్​లో పార్టీకి ద్రోహం చేసి కొడుకును అడ్డదారిలో గెలిపించుకున్న మహానాయకుడు. ఇలాంటి వ్యక్తి హైదరాబాద్​లో ఏమీ అభివృద్ధి జరగడం లేదని స్టేట్​మెంట్​ ఇచ్చాడు. అసలు ఈ ఆరేళ్లలో సిటీ కొంచెం కూడా ముందుకు వెళ్లలేదని అడ్డగోలుగా మాట్లాడాడు. బీజేపీ చెబుతున్నట్టల్లా ఆడుతున్నాడు.

తనను పట్టించుకోవడం లేదనే కోపంతో కేసీఆర్​ను, కేటీఆర్​ను బద్​నాం చేస్తున్నాడు. కాటికి కాలు చాపిన వయసులోనూ విపరీతంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్​లో జరిగిన అభివృద్ది గురించి రాయాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత, ఎవరూ ఊహించని విధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ, ఫార్మా, పవర్‌, ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, అగ్రోబేస్డ్‌, గ్రానైట్‌ స్టోన్‌ క్రషింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, పేపర్‌, ప్రింటింగ్‌, టెక్స్‌టైల్స్‌, సిమెంట్‌, ఏరోస్పేస్‌, సోలార్‌, ఆటోమొబైల్‌ రంగాలు వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే కాక వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలలో సైతం విస్తరించాయి. వివిధ రంగాలలో గడిచిన ఐదేండ్లలో (ఈ ఏడాది జనవరి నాటికి) తెలంగాణకు సుమారు రూ.2,04,088.65 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా, ఐటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పుకొనేవాళ్లు సైతం ఆశ్చర్యపడేలా తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి బహుళజాతి ఐటీ కంపెనీలతోపాటు, నోవార్టిస్‌, సేల్స్‌ఫోర్స్‌, వెల్‌స్పన్‌, పీ అండ్‌ జీ సహా అనేక ఇతర సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా అమెజాన్‌ తన రెండవ వెబ్‌ సర్వీస్‌ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుంది. ఈ వెబ్‌సర్వీస్‌ కేంద్రం ఏర్పాటుకు అమెజాన్‌ ఏకంగా రూ.20,761కోట్ల పెట్టుబడులను తెలంగాణలో పెట్టనుంది.   హైదరాబాద్‌ కేంద్రంగా, వివిధ రంగాలకు చెందిన పలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. దీనితో ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ వంటి విదేశీ సంస్థ పెట్టబోయే ఈ భారీ పెట్టుబడితో యువతకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అటు ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలే కాకుండా ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ బ్రాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నది.

Top