You are here
Home > Uncategorized > రోజులు దగ్గరపడింది కేసీఆర్ ప్రభుత్వానికి కాదు ఈటలా.. అది నీకే

రోజులు దగ్గరపడింది కేసీఆర్ ప్రభుత్వానికి కాదు ఈటలా.. అది నీకే

Spread the love

 

రోజులు దగ్గరపడే.. మంత్రి పదవి పోగొట్టుకున్నావ్.. ఇంకా బుద్ధి రాలేదా?

– రోజులు దగ్గరపడింది కేసీఆర్ ప్రభుత్వానికి కాదు ఈటలా.. అది నీకే

– రోజులు దగ్గరపడ్డందుకే నీ పదవి ఊడింది.. పార్టీని మారాల్సి వచ్చింది

– రేపు హుజూరాబాద్ లో ఓటమితో.. నీకు శాశ్వతంగా రోజులు లేనట్టే

హయ్యో.. హయ్యో… హయ్యయ్యో.. అన్నట్టే ఉంది ఈటల రాజేందర్ సంగతి. కబ్జాలతో గబ్బు లేపి.. మంత్రి పదవికి దూరమై.. ఇజ్జత్ కాపాడుకోవడానికి.. పరిశ్రమలు కాపాడుకోవడానికి.. ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఈ లెక్కన.. రోజులు దగ్గరపడ్డది కేసీఆర్ ప్రభుత్వానికా.. లేదంటే ఈటల రాజేందర్ కా? ఈ విషయంలో ఈటల ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. లేదంటే.. అది ఆయన మనుగడకే ముప్పు తీసుకువస్తుంది. ఎందుకంటే..

బీజేపీలో చేరిన దగ్గర్నుంచి.. ఈటలకు వరుసగా అవమానాలే ఎదురవుతున్నయ్. ఢిల్లీకి పోతే.. కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా కండువ వేయలే. వేరే సీనియర్ నాయకుడు కండువా వేసి బీజేపీలోకి లాక్కున్నరు. అక్కడే కుంగిపోయిన ఈటల.. హైదరాబాద్ వచ్చేసరికి పెద్ద నాయకులు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలైతే… కనీసం దేకను కూడా దేకలేదు. ఓ శుభాకాంక్షల సందేశం కూడా లేదు.

ఈ సందర్భంలో మరింత ఆవేదనకు గురైన ఈటల.. ఆ తర్వాత కిషన్ రెడ్డి, సంజయ్, అర్వింద్ లాంటి నేతల తీరుతో ఇంకింత కన్నీటి పర్యంతమయ్యే స్థితికి దిగజారిండు. వాళ్లెవరూ ఈయన్ను పట్టించుకోవడం లేదని ఈటల అనుచరులు ఆఫ్ ద రికార్డ్ గా బీజేపీ నేతల తీరును ఎండగడుతున్నరు. ఈ వైఖరి.. చివరికి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు నామినేషన్ కూడా రాకుండ చేస్తదేమో అని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నరు.

ఈటలా.. ఇవన్నీ మనసులో పెట్టుకుని లోపల బాధపడుతూ.. బయటికి నటించకు. రాబోయే ఉప ఎన్నికలో నీకు ఎదురుకానున్న స్పష్టమైన ఓటమితో.. నీకే రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయన్న వాస్తవం బోధపడుతుంది. ఆ సమయంలో.. నీకు అక్కరకొచ్చే పని ఏదన్న ఉంటదేమో చూసుకో. నీ బాధను తీర్చే మార్గాన్ని ముందే వెతికి పెట్టుకో. అలా కాదంటే.. ఓటమి మిగిల్చే భయంకరమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండు.

Top