You are here
Home > Uncategorized > రోజురోజుకూ ఒంటరి అయిపోతున్న ఈటల.. అనుచరులు వెళ్లిపోతున్నారిలా..!

రోజురోజుకూ ఒంటరి అయిపోతున్న ఈటల.. అనుచరులు వెళ్లిపోతున్నారిలా..!

Spread the love

 

రోజురోజుకూ ఒంటరి అయిపోతున్న ఈటల.. అనుచరులు వెళ్లిపోతున్నారిలా..!

– హుజూరాబాద్ లో ఏటికి ఎదురీదుతున్న కబ్జాల అలియాస్ ఈటల

– వాస్తవాలు గ్రహించి.. ఈటల నుంచి ఒక్కొక్కరుగా విడిపోతున్న అనుచరులు

– కేసీఆర్ నాయకత్వంపైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్న హుజూరాబాద్ ప్రజలు

హుజూరాబాద్ వేదికగా నడుస్తున్న దుష్ట రాజకీయాలను ప్రజలు ఛేదిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని వదులుకునే సమస్యే లేదని తమ చర్యలతో స్పష్టీకరిస్తున్నారు. సంక్షేమాన్ని అందించే కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నరు. ఈ క్రమంలో.. ప్రజల మనోభావాలను గుర్తిస్తున్న కబ్జాల అలియాస్ ఈటల అనుచరులు సైతం.. తిరిగి టీఆర్ఎస్ తోనే నడుస్తున్నరు. పథకాలను ప్రజలకు అందించే సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నరు.

ఇప్పటికే.. ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్.. కేసీఆర్ నాయకత్వానికే జై కొట్టారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన ఆయన.. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే దిశగా పని చేస్తున్నారు. ఈటలకు దూరంగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసే పనిలో ఉన్నారు. తాజాగా.. ఈటలకు చెందిన మరి కొందరు అనుచరులు సైతం.. తమ అడుగులు టీఆర్ఎస్ తోనే అని స్పష్టం చేశారు. ఈటలను మరింత ఒంటరిని చేశారు.

దేశిని కోటి.. ఆయన సతీమణి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  దేశిని స్వప్న.. కేసీఆర్ కే జై కొట్టారు. తాము కారు గుర్తుపైనే గెలిచామని… టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వాళ్లు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో.. ఈటల మరింత ఒంటరిగా మారిపోయారు. త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన గెలిచే అవకాశాలను మరింతగా కోల్పోయారు. ప్రజల్లో పట్టు ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా టీఆర్ఎస్ వెంటే ఉండడంతో.. ఆయన షాక్ తింటున్నారు.

పాదయాత్ర పేరుతో ఈటల చేస్తున్న పొలిటికల్ డ్రామాకు.. సొంత పార్టీ నుంచే మద్దతు కరువైంది. మద్దతుగా కనీసం సీనియర్ నేతలు ఎవరూ కామెంట్లు కూడా చేయడం లేదు. ఒక్కడే జనాలను కలుస్తూ.. ఈ ఒక్కసారి గెలిపించాలని కోరుతూ ముందుకు పోతున్నడు ఈటల. కానీ.. ఆయన చేసిన కబ్జాలకు, అవినీతికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఇదే.. ఈటలను ఒంటరి చేస్తోంది. నిష్పాక్షిక పాలన అందిస్తున్న కేసీఆర్ ను జనానికి మరింత చేరువ చేస్తోంది.

Top