You are here
Home > Latest News > కబ్జాల ఈటలా.. ఆరోపణలు నిరూపిస్తావా.. తప్పుకుంటావా?

కబ్జాల ఈటలా.. ఆరోపణలు నిరూపిస్తావా.. తప్పుకుంటావా?

Spread the love

 

కబ్జాల ఈటలా.. ఆరోపణలు నిరూపిస్తావా.. తప్పుకుంటావా?

– తప్పుడు ప్రచారాలతో.. ఊగిపోతున్న కబ్జాకోరు ఈటల

– హుజూరాబాద్ లో ఇంటెలిజెన్స్ వాళ్లు.. అంటూ.. నిరాధార ఆరోపణలు

– ఆరోపణలు నిరూపించకుంటే.. హుజూరాబాద్ బరి నుంచి తప్పుకోవాల్సిందే

భూ కబ్జాలకు అలవాటు పడి మంత్రి పదవి నుంచి ఊస్టింగ్ అయిన ఈటల రాజేందర్.. బీజేపీ గూటిలో జాగ దొరికిన తర్వాత నుంచి మరింతగా తప్పుడు కూతలకు బరితెగిస్తున్నాడు. బీసీ ముసుగులో దొరల వేషాలకు అలవాటు పడిన ఆయన.. కాషాయం కండువా వేసుకున్నాక.. అడ్డూ అదుపూ లేకుండా అబద్ధాలు మాట్లాడ్డంలో తెగిస్తున్నాడు. కేసీఆర్ సర్కారుపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. ప్రజల్లో రోజురోజుకూ మరింతగా చులకనవుతూ దిగజారిపోతున్నాడు.

వంద మందికి పైగా ఇంటెలిజెన్స్ వాళ్లు హుజూరాబాద్ లో ఉన్నరట. ఓటర్లను బెదిరిస్తున్నరట. అసలు ఏం మాట్లాడుతున్నవయ్యా ఈటలా.. వాళ్ల పేర్లు, ఇంటెలిజెన్స్ ఐడీ నంబర్లు కూడా చెబితో పోయేది కదా. నీలాంటోని గురించి హుజూరాబాద్ దాకా వచ్చి.. జనాన్ని భయపెట్టాల్సిన అవసరం వాళ్లకు ఏముంది? రాష్ట్రంలో చక్కదిద్దాల్సిన పనులు వాళ్లకు చాలా ఉన్నయ్. నీ అట్లాంటి కబ్జాకోరుల భరతం పట్టాల్సిన పనులు ఎన్నో ఉన్నయ్.

ఇలా ఆరోపణలు చేసే బదులు.. ఏదైనా ఆధారం చూపిస్తే.. ఈటల మాటలకు కాస్తైనా విశ్వసనీయత ఉంటుంది. అలా చూపించని పక్షంలో.. ఆయన హుజూరాబాద్ బరి నుంచి తప్పుకోవాల్సిందే. మరో విషయం. ఓట్ల కోసమే దళితులపై కేసీఆర్ కు ప్రేమ పుట్టుకొచ్చిందట. అదే నిజమైతే.. తెలంగాణ ఆవిర్భావం నుంచి అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకున్న దళితుల గురించి ఈటల ఎందుకు మాట్లాడడం లేదు?

గెలుపు కోసం సీఎం అబద్ధాలు చెప్తాడని అంటున్న ఈటల.. ఈ విమర్శల పరంపరలో పడి తాను అబద్ధాలు ఆడుతున్న విషయాన్ని ఎందుకు మరుస్తున్నడో మరి. అయినా.. ఈ విషయాన్ని జనం వదలడం లేదు. ప్రతి మాటను, ప్రతి విమర్శను లెక్కగడుతున్నరు. తప్పుడు కూతలు చేయవద్దని.. విమర్శలకు, ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నరు లేదంటే.. రాజకీయంగా పాతరేస్తమని హుజూరాబద్ ప్రజలు కబ్జాల ఈటలను హెచ్చరిస్తున్నరు.

Top