You are here
Home > Uncategorized > ఈటల చేసిన తప్పులు మామూలువి కావు… తప్పు చేశాడు.. వేటు పడింది

ఈటల చేసిన తప్పులు మామూలువి కావు… తప్పు చేశాడు.. వేటు పడింది

Spread the love

ఈటల చేసిన తప్పులు మామూలువి కావు…

తప్పు చేశాడు.. వేటు పడింది

పేదల భూములను లాక్కుందామని ప్లానేసిన మంత్రి ఈటలపై చర్య తీసుకున్నందుకు సీఎం కేసీఆర్​ను మెచ్చుకోవాల్సిన ప్రతిపక్షాలు.. ఎప్పట్లాగే ఆయనను తిట్టడం షురువు చేశాయి. ఇక జన్మలో తమకు బుద్ధిరాదని ప్రకటించుకున్నాయి. తాము పేదలకు ఎప్పుడూ వ్యతిరేకమని చాటిచెప్పుకున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని.. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేశాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించాడు.  భూకబ్జా చేశాడని మంత్రి ఈటలను తప్పించారని.. ఆయన ఒక్కడే కాకుండా టీఆర్ఎస్ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కబ్జాదారులేనని ఆయన అన్నారు. బండి సంజయ్​ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం ? హాఫ్​ హెయిర్​, హాఫ్​ బ్రెయిన్​. దేడ్​ దిమాగ్​గాడు. ఈటలతోపాటు ఇతర తెరాస ఎమ్మెల్యేలు కబ్జాలు చేశారని ఆరోపించడం వరకు బాగానే ఉంది. ఈటల కబ్జాలకు డాక్యుమెంట్​ ప్రూఫ్స్​ ఉన్నాయి. బాధితులు కంప్లైంట్​ చేశారు. మిగతా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏవైనా ప్రూఫ్స్​ ఉంటే బీజేపీ బయటపెట్టాలి. కేటీఆర్​ గానీ కేసీఆర్​ గానీ ఎవరి దగ్గరనైనా భూమి లాక్కుంటే ఆధారాలు చూపాలి. అవినీతి జరిగితే సీబీఐకో సీవీసీకో కంప్లైయింట్​ చేయాలి. ఇవేవీ లేకుండా గొట్టాలు పట్టుకొని మైకుల ముందు ఊగితే లాభం లేదు. ఈటలను తన పార్టీలోకి లాక్కోవాలనే ప్లాన్​తో బీజేపీ ఇలా మాట్లాడుతోంది. కేసీఆర్ గతంలోనే క్లియర్​ గాచెప్పారు. కబ్జాలు చేస్తే తన పార్టీవారినైనా వదలబోనని స్పష్టంగా చెప్పారు. ఈటల రాజేందర్​ చేసింది ఏదో ఒకటి ప్లాట్ల కబ్జాలు కాదు. పదుల ఎకరాలు. అవి పేదల భూములు. అసైన్డ్​ ల్యాండ్స్​. అయినా ఊర్కోవాలంటే ఎట్ల ? కరోనా ఉంది కాబట్టి దోషిని వదిలేయాలనడం ఏం న్యాయం ? అయితే అటు ఈటల మాటలను విశ్లేషిస్తే ఆయన చెబుతున్నవన్నీ తప్పులు.  సాధారణంగా అసైన్డ్ భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే, దాన్ని తిరిగి కేటాయించే అధికారం కేబినెట్‌కే ఉంటుంది. ఆ కేబినెట్‌లో ఈయన సభ్యుడు. ఆ నిర్ణయం పెండింగులో ఉన్నప్పుడు ఇది జరిగింది. నిర్ణయం రాకముందే ఆయన పేదలను బెదిరించారు. భూములు వాపస్​ ఇవ్వాలని వార్నింగ్​ ఇచ్చారు. అసలు మంత్రివర్గ సభ్యులు వ్యాపారం చేయకూడదు. ఈయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వ్యాపారాల గురించి మాట్లాడారు. వాటికి ఆయన బినామీ అన్న విషయం చిన్న పిల్లోడికీ తెలుసు.

Top