You are here
Home > Latest News > కరోనాపై కిరికిరి చేస్తే జైలు తప్పదు…

కరోనాపై కిరికిరి చేస్తే జైలు తప్పదు…

Spread the love

 

  • కరోనాపై కిరికిరి చేస్తే జైలు తప్పదు…
  • అబద్ధపు ప్రచారం చేస్తే జైలుకెళ్లడం ఖాయం..
  • ఇలాంటి వార్తలను షేర్ చేసిన పోలీసులు తొలు తీస్తారు…
  • ప్రజలు సంయమనంతో వ్యవహరించి సహకరించాలి…

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న‌వేళ  కొంతమంది పని పాట లేని వ్యక్తులు అబద్ధపు కథనాలను ప్రచురిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కరోనా వైరస్ గురించి లేనిపోని మాటలు రాస్తూ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు మనమంతా సంయమనంతో వ్యవహరించాలి. అంతే కానీ కొంతమంది యూట్యూబ్లో, వెబ్సైట్లో కానీ లేనిపోని వార్తలు రాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు.

 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ను ఎప్పటికప్పుడు బయటకు తీస్తూనే ఉంది. క‌రోనా గురించి చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో సందట్లో సడేమియా లాగా కొందరు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకటే గుర్తుంచుకోవాలి. అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేసేవాళ్లను పోలీసులు  వదిలి పెట్టరు అనవసరంగా ప్రచారం చేస్తే వాళ్లను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం ఖాయం. ఇక ఇలాంటి వార్తలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసే వారు కూడా జైలుకెళ్లడం ఖాయమని తెలుసుకోవాలి. క‌రోనా వైరస్ కారణంగా లభించిన విరామాన్ని ఇంట్లోనే ఉండి గడపాలి బయటకు అనవసరంగా వెళ్తే చిక్కులు తప్పవు తెలుసుకోవాలి.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా కరోనా వైరస్ అదుపులో ఉంది. ఇక్కడ అంతగా దానిప్ర‌భావం కనిపించడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు క‌రోనా ఉనికిలోకి వచ్చిన వెంటనే జన సమర్థ ప్రాంతాలైన సినిమా హాల్, ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్ల‌ను నిషేధించి మంచి పని చేశారు. దీంట్లో వైర‌స్‌ వ్యాపించడం తగ్గిపోయి మన రాష్ట్రంలో అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

 

అంతేగాని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కేసులను తక్కువ చేసి చూపించడం లేదని తెలుసుకోవాలి. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకునే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ప్రజలు కూడా సహకరించి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలి. లేనిచో ఇంట్లోనే ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వైర‌స్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.

Top