You are here
Home > Uncategorized > రైతు వెన్ను విరిచారు…

రైతు వెన్ను విరిచారు…

Spread the love

 

  1. రైతు వెన్ను విరిచారు…
  2. ఇప్పుడు రెట్టింపు ఆదాయం అని అబద్ధాలు
  3. రెట్టింపు అయింది పెట్టుబడి ఖర్చు

 

రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న ప్రకటన చేయడానికి ముందు కేంద్ర ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. తన పాలనలో కర్షకులు చాలా కష్టాలు పడుతున్నారని తెలిసి కూడా వారి ఆదాయాన్ని డబుల్ చేశామని మోసపూరిత ప్రకటన చేయడం దారుణం. ఆదాయం డబుల్ కావడం కాదు. మోడీ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు వ్యవసాయం మానేయాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ వరి రైతులు అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. కేసీఆర్ ఆదుకోకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాని మోదీ రైతు వ్యతిరేకి. పంజాబ్‌లో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నదో చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి గాకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ? దేశంలో ఎరువుల ధ‌ర‌ల‌తో పాటు డీజిల్, పెట్రోల్ ధరల‌ను రెట్టింపు చేశారు. త‌ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయి. పెట్టుబ‌డి ఖ‌ర్చుల‌ను రెట్టింపు చేశారు త‌ప్ప రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌లేదు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్లు స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార్సుల ప్ర‌కారం పంట‌లకు మ‌ద్ద‌తు ధ‌ర‌లు అమ‌లు చేయ‌డం లేదు.

దేశంలో పండే 53 పంటలకు గాను కేవలం 29 పంటలకే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ ప్రకటిస్తున్నారు. అందులో ప్రధానంగా నాలుగైదు పంటలనే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా పండిన పంటలో 25 శాతం మాత్రమే కొంటున్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి వ్యవసాయ రంగం పట్ల ఒక సమగ్ర విధానం గానీ, ప్రణాళిక గానీ లేదు. నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల మరణాలకు కారణమైన దుర్మార్గుడు మోడీ. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.

Top