You are here
Home > Uncategorized > భాగ్యనగర నలుచెరగులా.. ఆరోగ్యపు సరిహద్దులు! – వైద్య రంగంలో తెలంగాణలో సరికొత్త ప్రమాణాలు

భాగ్యనగర నలుచెరగులా.. ఆరోగ్యపు సరిహద్దులు! – వైద్య రంగంలో తెలంగాణలో సరికొత్త ప్రమాణాలు

Spread the love

 

భాగ్యనగర నలుచెరగులా.. ఆరోగ్యపు సరిహద్దులు!

– వైద్య రంగంలో తెలంగాణలో సరికొత్త ప్రమాణాలు

– రాజధానికి 4 దిక్కుల్లో త్వరలో అత్యాధునిక ఆస్పత్రులు

– ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలు

తెలంగాణలో ఏ పల్లెను కదిలించినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అన్న ఆవేదన.. ఇప్పటికీ ఎంతో కొంత మందిలో కనిపిస్తూ.. వినిపిస్తూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో.. అంతటి ఆవేదనను తెలంగాణ తల్లి అనుభవించింది. తన బిడ్డల అనారోగ్యాన్ని కన్నీళ్ల రూపంలో అనుభవించి.. ఆవేదనకు గురైంది. ఎప్పుడైతే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో.. ఆనాడే ఆ శోకం స్థానంలో ఆశావహ దృక్పథం ఏర్పడింది.

కేసీఆర్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో.. ఆ నాటి నుంచే రాష్ట్ర ఆరోగ్య రంగంలో మార్పులు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ గాంధీ మొదలు.. పల్లెపల్లెలోని గల్లీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. వసతులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు.. అది కూడా పెద్దాపరేషన్ కాకుండా సాధారణ ప్రసవాలు జరిగాయి. అందుకోసం.. కేసీఆర్ సర్కారు కేసీఆర్ కిట్ వంటి పథకాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక ప్రోత్సాహకాల పథకాలు అందుబాటులోకి తెచ్చింది.

క్యాన్సర్ రోగులకు, కిడ్నీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారి ప్రాణాలకు భరోసా దక్కింది. ఇప్పుడు కరోనా విపత్తు వచ్చిన సమయంలో అయితే.. ప్రభుత్వ ఆస్పత్రులే పైసా ఖర్చు లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడాయి. లక్షల మందిని కరోనా రక్కసి నుంచి ప్రాణాలతో సహా రక్షించాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చినా రకరకాల కలర్ల వైరస్ లు వచ్చినా అత్యున్నత చికిత్స అందిస్తూ దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నాయి.

ఇదే తరుణంలో.. రాష్ట్ర వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వరంగల్ లో ఏకంగా 60 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా.. రాజధాని హైదరాబాద్ నలుదిక్కులా.. మరో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి సంకల్పించింది. అందులో.. చెస్ట్ హాస్పిటల్ లో ఒకటి.. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో ఒకటి.. అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో ఒకటి.. గచ్చిబౌలిలోని టిమ్స్ లో మరోటి.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది.

ఇవి పూర్తయితే.. దేశంలోనే.. వైద్య రంగానికి తెలంగాణ.. సంపూర్ణ హబ్ గా మారే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రజానీకానికి.. అనారోగ్య విపత్తులను ఎదుర్కొనేందుకు మరింత సౌకర్యం కలగనుంది. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితోనే ఇంతటి వైద్య రంగ అభివృద్ధి సాకారమై.. ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.

Top