You are here
Home > Uncategorized > గంజాయిపై పోరుకు భలే ప్లాన్​!

గంజాయిపై పోరుకు భలే ప్లాన్​!

Spread the love

గంజాయిపై పోరుకు భలే ప్లాన్​!

రైతుబంధు నిలిపివేత ఐడియా బాగుంది

 

గంజాయికి బానిసైన వారి జీవితం లిటరల్​గా ముగిసిపోయినట్టే! ఒకరకంగా చెప్పాలంటే అతడు/ఆమె చచ్చిన శవంతో సమానం. డబ్బు, పరువు, ఆరోగ్యం అంతా సర్వనాశనం. కుటుంబ సభ్యులూ పట్టించుకోరు. సమాజం ముఖంపై ఉమ్మేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలను ఆశ్రయించిన వ్యవసపరులు ఎంతో మంది. తెలంగాణలోనూ ఈ దుర్మార్గపు సంస్కృతి మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఉన్నదున్నట్టు మాట్లాడాలంటే ఉత్తరాంధ్ర నుంచి ఇది ఎక్కువగా వస్తోంది.

ఇక్కడ ఏకంగా వనాలే ఉన్నాయని మెదక్​ పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో సాగవుతోంది. మొదట్లోనే ఈ చండాలన్ని తుంచేయకపోతే రాచపుండు అవుతుంది. తెలంగాణ మరో పంజాబ్​ అవుతుంది. రాష్ట్రంలో గంజాయి కొకైన్ ఎల్సీడి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దానిని మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుంది.కేసీఆర్​ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి పేరు వింటే వణుకుపుట్టేలా చేశారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర పోలీసు,ఎక్సైజ్ అధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి సిఎం కెసిఆర్ మంచి సూచనలు చేశారు.  డ్రగ్స్‌ను నియంత్రించేందుకు బాధ్యత కలిగిన మానవులుగా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలన్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని దానిని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని సిఎం వ్యాఖ్యానించారు.

ఇక నుంచి గ్రేహౌండ్స్ తరహాలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటవుతుంది. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి, నార్కొటిక్ డ్రగ్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను గుర్తించి కఠినంగా నిర్మూలిస్తారు.   గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా…. ఆ సమాచారం అందించక పోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తారు.

Top