You are here
Home > National News > ప్రజల మద్దకు మళ్లీ టీఆర్ఎస్కే.. గ్రేటర్ కోట కచ్చితంగా గులాబీదే!

ప్రజల మద్దకు మళ్లీ టీఆర్ఎస్కే.. గ్రేటర్ కోట కచ్చితంగా గులాబీదే!

Spread the love

 

ప్రజల మద్దకు మళ్లీ టీఆర్ఎస్కే.. గ్రేటర్ కోట కచ్చితంగా గులాబీదే!

  • ప్రజల్లో కేసీఆర్ సర్కారుకే వ్యక్తమవుతున్న మద్దతు
  • గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా జనం
  •  ప్రజా బలం కోల్పోయిన విపక్షాలు.. టీఆర్ఎస్ వెంటే జనాలు

జనం ప్రభంజనంలా కదులబోతోంది. కారు గుర్తుకే ఓటు వేసేందుకు.. ప్రజానీకం తహతహలాడుతోంది. విపక్షాలు కుట్రలు ఛేదించే బాధ్యతను భుజానికెత్తుకుంది. గతం కంటే మిన్నగా… శతాధిక స్థానాలను గులాబీ గూటికి చేర్చేందుకు ఎదురు చూస్తోంది. త్వరలో రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్.. ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి అండగా ఉండేందుకు ఇప్పటికే సిద్ధమైంది. బీజేపీ అబద్ధాలు… కాంగ్రెస్ కుట్రలు.. చిన్నాచితకా పార్టీల కుయుక్తులకు చెక్ పెడతామని యావన్మంది ప్రజలు.. ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను మించిన ప్రజా సంక్షేమ కాంక్షిత రాజకీయ పార్టీ తెలంగాణలో లేదని.. రాదని తేల్చి చెబుతున్నారు.

ప్రజల మనోభావాల్ని.. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో వివరించారు. ప్రజలు టీఆర్ఎస్ కు దాదాపు 104 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విపక్షాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా పోయిందని.. అసలు ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో ఇలాగే పని చేయాలని నేతలు సూచించారు. సరిగా పని చేయని వారికి ఈ సారి టికెట్లు ఇచ్చే అవకాశమే లేదని అధినేత కేసీఆర్ తెగేసి చెప్పారు. కేడర్ కు సరైన దిశానిర్దేశం చేశారు.

ఇక.. కేంద్రం పెట్టే ఇబ్బందులు.. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు రాజకీయాలపై ఇప్పటికే జనం గుర్రుమీదున్నారు. యూరియా ఇవ్వకుండా పెడుతున్న కష్టాలకు తోడు.. తాము ఏదో చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చేసే ప్రచారాలపైనా ఆగ్రహిస్తున్నారు. హక్కుగా వచ్చే వాటిని కూడా కేంద్రం ఇవ్వడం లేదని.. బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులను సాధించలేకపోతున్నారని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే సమయంలో.. దుబ్బాక ఉప ఎన్నిక రాబోతోంది. ఈ రెండు ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే అనధికారికంగా టీఆర్ఎస్ కు గెలుపును ఖాయం చేశారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి సైతం పార్టీ నేతల ముందు చెప్పారు. గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న ప్రజలు సైతం.. తామంతా కేసీఆర్ వెంటే అని బలంగా నినదిస్తున్నారు.

ఎవరెన్ని చెప్పినా నమ్మేది లేదని.. తమకు అన్నీ అందిస్తున్న.. హైదరాబాద్ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేస్తున్న టీఆర్ఎస్ పరిపాలనను కాపాడుకుంటామని ప్రజలు చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వానికి అందబోయే గెలుపును.. ముందుగానే తమ విశ్వాసంతో బలంగా వ్యక్తీకరిస్తున్నారు.

Top