You are here
Home > Latest News > కేసీఆర్ కు ఏదో అయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

కేసీఆర్ కు ఏదో అయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

Spread the love

 

  • సీఎం కేసీఆర్ కు ఏమీ కాలే..అనవసర ప్రచారం వద్దు.
  • Where is Kcr అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు…
  • ప్రభుత్వ వ్యతిరేకులు # ట్యాగ్ పెట్టి నడుపుతున్నారు.
  • కేసీఆర్ కు ఏదో అయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
  • కానీ.. సీఎంకి ఏమీ కాలేదు.. కేసీఆర్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలంటూ బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ.. కేసీఆర్ కు ఏమైందని వేర్ ఈజ్ కేసీఆర్ అని యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో నడుపుతున్నారు. కేసీఆర్ కు కరోనా సోకిందని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం మీద బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. నాలుగురోజులు కనిపించకపోతే ఇంత రాద్దాంతం చేయాల్నా??. ఏం కేసీఆర్ కు వ్యక్తి గత పనులు, రెస్ట్ అనేది ఉండదా?. సీఎం కూడా ఒక మామూలు మనిషే. కరోనా టెన్షన్స్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి వెళ్తే.. ఏకంగా కరోనా సోకి,… క్వారంటైన్ లో ఉన్నారని విష ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ నాయకులు అర్వింద్, రఘునందన్ లాంటి వాళ్లు.. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా రావాలి అంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. ఇవాళ సడన్ గా సీఎం మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. మీరు అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ఏమీ కాలేదు. కేసీఆర్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరికీ త్వరలోనే ఆన్ స్క్రీన్ మీదనే కౌంటర్స్ ఇస్తారు జర్ర ఆగుర్రి.. బెబ్బులి గర్జిస్తే ఎలా ఉంటుందో, ప్రతిపక్షాలకు అసలైన సినిమా చూపిస్తారు కేసీఆర్.. కొంచెమంత ఓపిక పట్టండి.

కేసీఆర్ ఎక్కడ అనే దానికి త్వరలోనే మీకు సమాధానం దొరుకుతుంది. సీఎంకు ఏదో అయిపోయిందని.. ఏదో జరుగుతోందని.. ప్రజల్లో గుబులు రేపుతున్న విపక్ష నాయకుల్లారా?. మీకు కేసీఆరే సరైన మొగుడు. కేసీఆర్ మిమ్మల్ని సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అని తిట్టడంలో తప్పేం లేదు. సీఎం స్థాయి నాయకుడి మీద మరీ ఇంత దారుణమైన తప్పుడు ప్రచారమా?. ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రతిపక్షాలు ఉండవ్. ఇంత తప్పుడు ప్రచారం ఉండదు. థూ మీ బతుకులు చెడ.

Top