You are here
Home > Latest News > ఈ ఘటనతోనైనా ప్రజలు కళ్లు తెరవాలి

ఈ ఘటనతోనైనా ప్రజలు కళ్లు తెరవాలి

Spread the love

 

  1. మర్కజ్​ గురించి మొదట చెప్పింది తెలంగాణే!
  2. లేకపోతే రోగుల సంఖ్య పెరిగి ఉండేది..
  3. ఈ ఘటనతోనైనా ప్రజలు కళ్లు తెరవాలి

 

ఢిల్లీలోని మర్కజ్​ మసీదులో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన వారిలో వందలాది మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా గుర్తించింది మన కేసీఆర్​ ప్రభుత్వమే. వెంటనే కేంద్రాన్ని అలర్ట్​ చేయడంతో ఢిల్లీ పోలీసులు మసీదును మూసేయించి అందరినీ క్వారంటైన్​కు తరలించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం వ‌ల్ల స‌మ‌స్య తీవ్ర‌త బాగా త‌గ్గింది. అయితే ఆ కార్యక్రమ నిర్వాహకులు తప్పు చేశారా ? నిబంధ‌న‌ల‌ను పాటించారా ? వ‌ంటి అంశాల‌పై చ‌ర్చించ‌డం కంటే బాధితుల‌కు చికిత్స అందించ‌డం ఇప్పుడు అత్య‌వ‌స‌రం. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇక ముందు జ‌ర‌క్కుండా చూడాలి. ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లి వచ్చిన వారితో నగరంలో కరోనా కల్లోలం మరింత పెరిగింది. ఢిల్లీకి మొత్తం 603 మంది నగరం నుంచి వెళ్లి వచ్చారని అంచనా కాగా, ఇందులో ఇంకా వంద మంది ఎక్కడున్నారో ఆచూకీ తెలియడం లేదు.

వారంతా ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. ఇందులో కొందరు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లగా, మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు.  అయితే మ‌ర్క‌జ్ కార్య‌క్ర‌మానికి వెళ్లొచ్చిన వారిలో నగరానికి చెందిన వారిని, ఇత‌ర జిల్లాల వారినీ అధికారులు గుర్తించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాలు, సరోజినీదేవి, యునానీ ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు  చేయిస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన అనంతరం వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారో అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల  ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోండి. మీరు ఇలా దాక్కోవ‌డం వ‌ల్ల మీ కుటంబ స‌భ్యుల‌కు, పొరుగింటి వారికి వ్యాధి సోకుతుంద‌నే విష‌యాన్ని

Top