You are here
Home > Latest News > మరింత మెరుగ్గా.. మరింత వేగంగా..

మరింత మెరుగ్గా.. మరింత వేగంగా..

Spread the love

మరింత మెరుగ్గా.. మరింత వేగంగా..

  • ఇకపై పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు
  • కరోనా నేపథ్యంలో సిబ్బందికి మంత్రి కేటీఆర్ ఆదేశాలు
  • 5 రూపాయల భోజన స్టాళ్లు కొనసాగించాలని స్పష్టీకరణ

కఠినతర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే ముచ్చటేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వాన్ని చాటుకుంటుంటే.. మంత్రి కేటీఆర్ ప్రజల ఆరోగ్య భద్రతను పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు జనం ఆనందపడుతున్నారు. కరోనా చుట్టుముట్టిన ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో.. సిబ్బందిని సమన్వయం చేస్తున్న తీరుకు.. శభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు.

సగం రోజు లాక్ డౌన్.. మిగతా సగం రోజు కర్ఫ్యూ. పగలూ రాత్రి కూడా తేడా లేని కఠిన ఆంక్షలు. అయినా.. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరచాలని మంత్రిగా ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆంక్షల నేపథ్యంలో.. రహదారులపై రాకపోకలు నెమ్మదించిన పరిస్థితుల్లో.. రిపేర్లు, నిర్వహణ పరమైన లోపాలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 5 రూపాయలకు భోజన కేంద్రాలన్నీ తెరిచి ఉంచేలా చూస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. గూడు లేని వారిని గుర్తించి.. ఫుట్ పాత్ లపై బతుకున్న వాళ్లను గుర్తించి నైట్ షెల్టర్స్ కు తరలిస్తామని కేటీఆర్ చెప్పారు. వీటన్నిటికంటే ముఖ్యంగా.. మరో విషయాన్ని కూడా మంత్రివర్యులు ట్వీట్ చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారి వివరాలను.. ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

ఇంత పకబ్బందీగా నిర్ణయాలు, ప్రణాళికలు అమలు చేస్తూ.. ప్రజా సంక్షేమానికి ఇంతగా పాటుపడుతున్న ప్రభుత్వాలైతే ఇతర రాష్ట్రాల్లో లేవనే చెప్పాలని.. ప్రజలు అంటున్నారు. కరోనా నివారణ దిశగా ప్రభుత్వం ఏది చెప్పినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని అండగా నిలుస్తున్నారు.

Top