You are here
Home > Uncategorized > అరె సామీ.. ముందు నీది చూసుకోవయ్యా జగ్గారెడ్డి

అరె సామీ.. ముందు నీది చూసుకోవయ్యా జగ్గారెడ్డి

Spread the love

 

 

  • నువ్వు సక్కగా ఉండు ముందు..
  • నువ్వేదో పెద్ద పతీత లెక్క మాట్లాడుతున్నావు..
  • నీ బండారం అంత బయటపడింది కదా..

కేసీఆర్ అవినీతిని బయటపెడతావా? బాబూ జగ్గారెడ్డి.. ముందు నీది చూసుకో. తర్వాత వేరేవాళ్ల సంగతి చూద్దువు గానీ. ఉట్టికి ఎగురలేనమ్మ… స్వర్గానికి ఎగురుతానన్నట్టుంది ఈ జగ్గారెడ్డి మాటలు. ఏమయ్యా జగ్గారెడ్డి.. నిన్నగాక మొన్ననే కదా నిన్ను పోలీసులు అరెస్ట్ చేసింది. నువ్వేదో శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతున్నావేంది. కాంగ్రెస్ పార్టీ ఏదో శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మీ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి నువ్వు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీ పాలనలో వాళ్లు ఎంత క్షోభ అనుభవించారో వాళ్లకే తెలుసు. నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేమీ పెద్ద తోపువీ కాదు. నువ్వు ఆఫ్టరాల్ అంతే అర్థమయిందా? నువ్వేదో పీకుడుగాడివని.. ఏదో పీకేస్తానని అనుకుంటున్నావేమో.. నీతోటి ఏదీ కాదు. అర్థమయిందా. నీకు జైలే గతి. తప్పు చేసి జైలుకు వెళ్లి వచ్చినవాడివి నీకే అంతుంటే స్వతంత్రంగా తమ కాళ్ల మీద నిలబడి బతుకున్న తెలంగాణ ప్రజలకు ఇంకెంతుండాలి. నిన్ను, నీ పార్టీని గంగలో కలపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నరు. కాసుకో. నువ్వు ఎన్ని వెదవ నాటకాలు ఆడినా తెలంగాణలో గులాబీ జెండ ఎగురడం ఖాయం.

నువ్వు రథయాత్ర పెట్టుకో.. ఇంకేదైనా పెట్టుకో. కొండమీద కోతినైనా పిలుచుకొచ్చి ప్రచారం నిర్వహించుకో. ఎన్ని కుయుక్తులకు పాల్పడినా నీ బతుకు బస్టాండే తమ్మీ. నీ పని అయిపోయింది. ఇక చాలు.. ఇన్నేళ్లు నువ్వు, నీ పార్టీ తెలంగాణను దోచుకుతిన్నది చాలు. ఇంకా దోచుకుతిందామని అంతా కూడబలుక్కొని తెలంగాణ మీద పడుతున్నారా? ఖబర్ధార్.. మీకు మూడింది. మీ పార్టీ ఈ జన్మలో కాదు కదా.. పది జన్మలు ఎత్తినా తెలంగాణలో అధికారంలోకి రాదు. మీవన్నీ కేవలం పగటి కలలు మాత్రమే. అంతకు మించి మీరు ఇంకేం చేయలేరు. కలలు కంటూ ఉండండి. అంతే.

 

 

Top