You are here
Home > Latest News > నీకు గడ్డం పెరిగింది.. బ్రెయిన్​ పెరగలే…

నీకు గడ్డం పెరిగింది.. బ్రెయిన్​ పెరగలే…

Spread the love

 

  1. నీకు గడ్డం పెరిగింది.. బ్రెయిన్​ పెరగలే…
  2. ధరణి పోర్టల్​ ప్రైవేటుది అనడం నీ మూర్ఖత్వం జగ్గులూ
  3. ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారు…

జగ్గారెడ్డి పేరుకే సీనియర్​ నాయకుడు కానీ తెలివి మాత్రం గల్లీ లీడర్​ కంటే తక్కువ. ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి, స్కీమ్​ల గురించి కొంచెమైనా అవగాహన లేకుండా మాట్లాడుతూ తరచూ ఇజ్జత్​ తీసుకుంటడు. ఆస్తుల సర్వేను ఎలా విమర్శించాలో తెలియక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ అడ్డగాడిది మాటలకు కాంగ్రెసోళ్లే నవ్వుకుంటున్నరు. ధరణి పోర్టల్‌, యాప్‌పై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని  జగ్గారెడ్డి అంటున్నడు. తమ ఆస్తులను ధరణిలో చేర్చిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం అప్పులు చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోందని విమర్శించాడు. ప్రజల ఆస్తుల వివరాలను ప్రైవేటు యాప్‌ సంస్థ దగ్గర పెట్టడమేంటని ప్రశ్న వేశాడు.

వారేవా.. జగ్గులూ ఎంత లోతుగా ఆలోచించావ్​. ప్రజల ఇండ్లపై కేసీఆర్​ ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందా ? ధరణి వెబ్​సైట్​ ప్రైవేటుదా ? ప్రజల్లో అపోహలు ఉన్నాయా ? అసలు ఇంత తెలివి నీకెట్ల వచ్చింది జగ్గుభాయ్​! అసలు నీకున్న ట్యాలెంట్​కు నిన్ను కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ను చేయాలి. ఈ తెలివి తక్కువ సోనియా, రాహుల్​లకు నీ ట్యాలెంట్​ ఏంటో తెలియట్లేదు. ఇంకా చెప్పాలంటే నీ ట్యాలెంట్​ను తొక్కిపారేస్తున్నారు. నువ్వు అవినీతిపరుడివే కావొచ్చు.. ఒకసారి జైలుకు కూడా వెళ్లివచ్చావు. నీకు గల్లీగూండా అనే బిరుదు కూడా ఉంది. అయినా నీకు ఇన్ని తెలివితేటలు అబ్బాయ్​. శభాష్​ జగ్గులూ! ధరణి పోర్టల్​ ప్రైవేటుది అయితే అది ఐటీశాఖ అధ్వర్యంలో ఎలా పనిచేస్తున్నది ?

ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సర్వే చేస్తున్నారు. ప్రజల ఆస్తులపై లోనెంత వస్తుంది ? అంతదాకా ఎందుకు.. ఏ గవర్నమెంటు అయినా మన జనం ఆస్తిపై లోనివ్వండి అని అడుగుతుందా ? అలా చేస్తే బాధితుడు కోర్టుకు వెళ్తాడు కదా! ప్రజల్లో అపోహలు ఉంటే.. ఎక్కడ ఒక్క ఉద్యమం జరగలేదు. ఒక ర్యాలీ చేయలేదు. ఎవరూ కోర్టుకు ఫిర్యాదు చేయలేదు. మరి అపోహలు ఉన్నట్టు నీకెలా తెలుసు ? భవిష్యత్​లో ఆస్తుల జనం కొట్లాడుకోవద్దనే ఆలోచనతో ఈ సర్వే చేస్తున్నార్రా బుద్ధితక్కువ సన్నాసి! ప్రజలు సహకరించడం వల్లే ధరణి సర్వర్​ తరచూ డౌన్​ అవుతోంది. అసలు నీలో ఏం చూసి నిన్ను నీ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారో అర్థం కావడం లేదు. ఈ విషయంపై ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండు!

Top